Emdarigi valaduvo yevvamderumgu

ఎందరికి వలతువో యెవ్వఁడెరుఁగు
Language

(॥పల్లవి॥)
ఎందరికి వలతువో యెవ్వఁడెరుఁగు
కందువ నీచేఁతలిక్కడ నేనెరఁగనా

(॥ఎంద॥)
కట్టిన వన్నెదట్టి కైదండిచ్చినాపెది
కట్టుకొన్న కంటసరి కాళాంజాపెది
పెట్టుకొన్న పదకము పెద్దఅడపమాపెది
నెట్టున నీ సింగారాలు నేనెరఁగనా

(॥ఎంద॥)
కొనవేలి వుంగరము కుంచె వేసేయాపెది
కొనబు వొడ్డాణము గొడగాపెది
అనువైన పువ్వుదండ అవసరమాపెది
నినుపు నీసింగారాలు నేనెరఁగనా

(॥ఎంద॥)
ముడిచిన సవరము మురిపెపుగిండాపెది
బడినే నీ పెండెము పావడాపెది
పొడవై శ్రీ వెంకటేశ పుక్కిటివీడెము నాది
నిడివి నీ సింగారాలు నేనెరఁగనా

(||pallavi||)
ĕṁdarigi valaduvo yĕvvam̐ḍĕrum̐gu
kaṁduva nīsem̐talikkaḍa nenĕram̐ganā

(||ĕṁda||)
kaṭṭina vannĕdaṭṭi kaidaṁḍichchinābĕdi
kaṭṭugŏnna kaṁṭasari kāḽāṁjābĕdi
pĕṭṭugŏnna padagamu pĕddaaḍabamābĕdi
nĕṭṭuna nī siṁgārālu nenĕram̐ganā

(||ĕṁda||)
kŏnaveli vuṁgaramu kuṁchĕ veseyābĕdi
kŏnabu vŏḍḍāṇamu gŏḍagābĕdi
anuvaina puvvudaṁḍa avasaramābĕdi
ninubu nīsiṁgārālu nenĕram̐ganā

(||ĕṁda||)
muḍisina savaramu muribĕbugiṁḍābĕdi
baḍine nī pĕṁḍĕmu pāvaḍābĕdi
pŏḍavai śhrī vĕṁkaḍeśha pukkiḍivīḍĕmu nādi
niḍivi nī siṁgārālu nenĕram̐ganā