ఎందరి నెలయించితో యిట్లానే బూమిలోన
(॥పల్లవి॥)
ఎందరి నెలయించితో యిట్లానే బూమిలోన
సందడిలోనే మీ(నీ?)కు సతమైతిమి
(॥ఎందరి॥)
కొచ్చి కొచ్చి నీవిట్టే కొలువుసేయించుకోఁగా
మచ్చికతోడుత నిన్ను మరిగితిమి
పచ్చిగా నీవు మాతో పగడసాలాడఁగాను
రచ్చకెక్కి యింతేసి రవ్వయితిమి
(॥ఎందరి॥)
మంతనాన మాచే నాకు మడిచి ఇప్పించుకోఁగా
ఇంతులమై నిన్ను నిట్టే యెనసితిమి
సంతతము నీవిట్టే సంగడిఁ బెట్టుకుండఁగా
నంతటా మందెమేళములై పెనఁగితిమి
(॥ఎందరి॥)
కప్పురము మోవి నంటి కాఁగిలింపించుకోఁగాను
వొప్పుగా దేవుళ్ళమై వొనరితిమి
యిప్పుడే శ్రీవేంకటేశ యిన్నిటా మమ్మేలఁగాను
యెప్పుడూ నురముమీఁద నిరవైతిమి
(||pallavi||)
ĕṁdari nĕlayiṁchido yiṭlāne būmilona
saṁdaḍilone mī(nī?)ku sadamaidimi
(||ĕṁdari||)
kŏchchi kŏchchi nīviṭṭe kŏluvuseyiṁchugom̐gā
machchigadoḍuda ninnu marigidimi
pachchigā nīvu mādo pagaḍasālāḍam̐gānu
rachchagĕkki yiṁtesi ravvayidimi
(||ĕṁdari||)
maṁtanāna māse nāgu maḍisi ippiṁchugom̐gā
iṁtulamai ninnu niṭṭe yĕnasidimi
saṁtadamu nīviṭṭe saṁgaḍim̐ bĕṭṭuguṁḍam̐gā
naṁtaḍā maṁdĕmeḽamulai pĕnam̐gidimi
(||ĕṁdari||)
kappuramu movi naṁṭi kām̐giliṁpiṁchugom̐gānu
vŏppugā devuḽḽamai vŏnaridimi
yippuḍe śhrīveṁkaḍeśha yinniḍā mammelam̐gānu
yĕppuḍū nuramumīm̐da niravaidimi