Emdari bhramimchidivo yiduvalene

ఎందరి భ్రమించితివో యిటువలెనే
Language

(॥పల్లవి॥)
ఎందరి భ్రమించితివో యిటువలెనే
యెందును నీ మర్మ మిది యెరఁగ మైతిమిరా

(॥ఎంద॥)
మచ్చికల నీతోడ మాటలాడి నిన్నటి
మచ్చరపుటుకలు మరచితిని
మచ్చట నీవిటువంటి మెకమాయకాఁడ వౌత
యిచ్చలోన నేము తొల్లె యెరఁగ మైతిమిరా

(॥ఎంద॥)
పక్కన నిన్ను దగ్గరి పంతపుమాట లెల్ల
మక్కళించి యాడ నీతో మరచితిని
గక్కన నీ వింతతమకములు నేరుచుకొంట
యిక్కువగా నేఁడు నేము యెరఁగ మైతిమిరా

(॥ఎంద॥)
పెనఁగి పెనఁగి నీతోఁ బెట్టుకొన్నవొట్లెల్ల
మన సిచ్చి కూడి నే మరిచితిని
ననిచి శ్రీవెంకటేశ నాఁటఁకీడ వవుత నిన్ను
యెనసినవేళ నేమీ నెరఁగ మైతిమిరా

(||pallavi||)
ĕṁdari bhramiṁchidivo yiḍuvalĕne
yĕṁdunu nī marma midi yĕram̐ga maidimirā

(||ĕṁda||)
machchigala nīdoḍa māḍalāḍi ninnaḍi
machcharabuḍugalu marasidini
machchaḍa nīviḍuvaṁṭi mĕgamāyagām̐ḍa vauda
yichchalona nemu tŏllĕ yĕram̐ga maidimirā

(||ĕṁda||)
pakkana ninnu daggari paṁtabumāḍa lĕlla
makkaḽiṁchi yāḍa nīdo marasidini
gakkana nī viṁtadamagamulu nerusugŏṁṭa
yikkuvagā nem̐ḍu nemu yĕram̐ga maidimirā

(||ĕṁda||)
pĕnam̐gi pĕnam̐gi nīdom̐ bĕṭṭugŏnnavŏṭlĕlla
mana sichchi kūḍi ne marisidini
nanisi śhrīvĕṁkaḍeśha nām̐ṭam̐kīḍa vavuda ninnu
yĕnasinaveḽa nemī nĕram̐ga maidimirā