ఎందరెందరినిట్లా నేలితివో వెనకకు
(॥పల్లవి॥)
ఎందరెందరినిట్లా నేలితివో వెనకకు
సందుసుడి నవ్వేవు జాణకాఁడవౌదువు
(॥ఎంద॥)
చెలియ చెక్కులవెంట చెమటలు గారఁగాను
అలరి పాదములోత్తీనప్పటనుండి
తలఁచరాదా దయ దానికేమి తప్పు గాదు
చలమెల్లనీడేరె జాణకాఁడవౌదువు
(॥ఎంద॥)
వువిదచన్నులపై నిట్టూరుపులు నిగుడఁగా
రవళిఁ బనులు సేసీ రాతిటనుండి
ఇవల మెచ్చఁగరాదా ఇందు వంక నేమి వోదు
జవళిపంతము వచ్చె జాణకాఁడవౌదువు
(॥ఎంద॥)
రమణిమోవితేనె గారఁగా ముద్దుమాటలను
సమరతిఁగూడీ నిన్ను జాముటనుండి
అమరి శ్రీవేంకటేశ అన్నిటా మన్నించరాదా
సముకాన సిగ్గులేల జాణకాఁడవౌదువు
(||pallavi||)
ĕṁdarĕṁdariniṭlā nelidivo vĕnagagu
saṁdusuḍi navvevu jāṇagām̐ḍavauduvu
(||ĕṁda||)
sĕliya sĕkkulavĕṁṭa sĕmaḍalu gāram̐gānu
alari pādamulottīnappaḍanuṁḍi
talam̐sarādā daya dānigemi tappu gādu
salamĕllanīḍerĕ jāṇagām̐ḍavauduvu
(||ĕṁda||)
vuvidasannulabai niṭṭūrubulu niguḍam̐gā
ravaḽim̐ banulu sesī rādiḍanuṁḍi
ivala mĕchcham̐garādā iṁdu vaṁka nemi vodu
javaḽibaṁtamu vachchĕ jāṇagām̐ḍavauduvu
(||ĕṁda||)
ramaṇimovidenĕ gāram̐gā muddumāḍalanu
samaradim̐gūḍī ninnu jāmuḍanuṁḍi
amari śhrīveṁkaḍeśha anniḍā manniṁcharādā
samugāna siggulela jāṇagām̐ḍavauduvu