Emdamaavi neerusese veme neevu

ఎండమావి నీరుసేసే వేమే నీవు
Language

(॥పల్లవి॥)
ఎండమావి నీరుసేసే వేమే నీవు
అండనుంటేఁ గాక దవ్వులైతే నవిగావా

(॥ఎండ॥)
అతఁడు నిన్నుఁ బిలిచీనదిగదె నాకుఁ
బతిగాఁజిలుకలే పలికీఁ బోవే
తతి నిందుకే యతఁడు తా నవ్వీనే అట్టె
వెతకితే నందు మారువెన్నెలలు గావా

(॥ఎండ॥)
తప్పకచూచీఁ గదె తగ నతఁడు నా -
ముప్పిరిఁ జూపుల మారు మొల్లలే పోవే
చెప్పి చేయిచాఁచి సన్నసేసీఁగదే
చెప్పిలు నాచేతి మారు చిగుళ్లుఁ గావా

(॥ఎండ॥)
అలమీఁ గాఁగిట నిన్ను నాతఁడే కదే నేఁ
గలసినట్టే తీగెలు కలసీఁ బోవె
బలిమి శ్రీవేంకటాద్రిపతి నిన్నుఁ జొక్కించె
నిలువునఁ జొక్కించేనానేరుపులే కావా

(||pallavi||)
ĕṁḍamāvi nīrusese veme nīvu
aṁḍanuṁṭem̐ gāga davvulaide navigāvā

(||ĕṁḍa||)
adam̐ḍu ninnum̐ bilisīnadigadĕ nāgum̐
badigām̐jilugale paligīm̐ bove
tadi niṁduge yadam̐ḍu tā navvīne aṭṭĕ
vĕdagide naṁdu māruvĕnnĕlalu gāvā

(||ĕṁḍa||)
tappagasūsīm̐ gadĕ taga nadam̐ḍu nā -
muppirim̐ jūbula māru mŏllale pove
sĕppi seyisām̐si sannasesīm̐gade
sĕppilu nāsedi māru siguḽlum̐ gāvā

(||ĕṁḍa||)
alamīm̐ gām̐giḍa ninnu nādam̐ḍe kade nem̐
galasinaṭṭe tīgĕlu kalasīm̐ bovĕ
balimi śhrīveṁkaḍādribadi ninnum̐ jŏkkiṁchĕ
niluvunam̐ jŏkkiṁchenānerubule kāvā