Emdalivaamdano yeṟumganu

ఎందలివాఁడనో యెఱుఁగను
Language

(॥పల్లవి॥)
ఎందలివాఁడనో యెఱుఁగను
కందువ నీవే కావవే దేవ

(॥ఎందలి॥)
తలఁతు నూరకే దైవము నొకపరి
తలఁతును సంసారధర్మము నొకపరి
వెలయఁగ సాలీఁడు వేసిన కండెయై
పొలసీఁ గాలము పొద్దుకుఁ బొద్దు

(॥ఎందలి॥)
ఒకపరి యెక్కుదు వుబ్బునఁ బొడవునకు
వొకపరి దిగుదును వూరకే కిందికి
యెకదిగఁగ కృషికుఁడెత్తు యేఁతమై
అకటా కర్మము లాడించీని

(॥ఎందలి॥)
ఆవల నన్నిట నహంకరించితి
శ్రీవేంకటేశ్వర సేవించితి నిన్ను
చేవ లేక యిటు చెఱకునఁ బండై
భావం బిటువలె పరిగెను నేఁడు

(||pallavi||)
ĕṁdalivām̐ḍano yĕṟum̐ganu
kaṁduva nīve kāvave deva

(||ĕṁdali||)
talam̐tu nūrage daivamu nŏgabari
talam̐tunu saṁsāradharmamu nŏgabari
vĕlayam̐ga sālīm̐ḍu vesina kaṁḍĕyai
pŏlasīm̐ gālamu pŏddugum̐ bŏddu

(||ĕṁdali||)
ŏgabari yĕkkudu vubbunam̐ bŏḍavunagu
vŏgabari digudunu vūrage kiṁdigi
yĕgadigam̐ga kṛṣhigum̐ḍĕttu yem̐tamai
agaḍā karmamu lāḍiṁchīni

(||ĕṁdali||)
āvala nanniḍa nahaṁkariṁchidi
śhrīveṁkaḍeśhvara seviṁchidi ninnu
seva lega yiḍu sĕṟagunam̐ baṁḍai
bhāvaṁ biḍuvalĕ parigĕnu nem̐ḍu