ఎందాఁకానే సిగ్గు లెవ్వరికి సెలవే
(॥పల్లవి॥)
ఎందాఁకానే సిగ్గు లెవ్వరికి సెలవే
కందువ నీనేర్పులకు కడమగాదా
(॥ఎందాఁ॥)
పట్టరారు ముట్టరాదు బలిమినే పెనఁగేవు
యెట్టివే నీకుచములు యెందు కెక్కెనే
గుట్టునఁ బయ్యదలోన గూఁట వేసుకుండఁగాను
తొట్టుకున్నపాయానకు దోసమురాదా
(॥ఎందాఁ॥)
చెప్పరాదు చూపరాదు చిమ్మిరేఁగి తిట్టేవు
ముప్పిరి నీమొలనూలు మూలదాఁచేవా
వుప్పతిల్లుమానము వొడిఁ బట్టుకుండఁగాను
అప్పుడే కన్నెరికాన కావతి రాదా
(॥ఎందాఁ॥)
నగరాదు తెగరాదు నంటునఁ గాఁగిలించేవు
చిగురు నీమోవితేనె చిందనేఁటికే
జిగి నలమేల్మంగవు శ్రీవేకటేశుఁడ నేను
తగులైతి మింపులకుఁ దగవేకదా
(||pallavi||)
ĕṁdām̐kāne siggu lĕvvarigi sĕlave
kaṁduva nīnerbulagu kaḍamagādā
(||ĕṁdām̐||)
paṭṭarāru muṭṭarādu balimine pĕnam̐gevu
yĕṭṭive nīgusamulu yĕṁdu kĕkkĕne
guṭṭunam̐ bayyadalona gūm̐ṭa vesuguṁḍam̐gānu
tŏṭṭugunnabāyānagu dosamurādā
(||ĕṁdām̐||)
sĕpparādu sūbarādu simmirem̐gi tiṭṭevu
muppiri nīmŏlanūlu mūladām̐sevā
vuppadillumānamu vŏḍim̐ baṭṭuguṁḍam̐gānu
appuḍe kannĕrigāna kāvadi rādā
(||ĕṁdām̐||)
nagarādu tĕgarādu naṁṭunam̐ gām̐giliṁchevu
siguru nīmovidenĕ siṁdanem̐ṭige
jigi nalamelmaṁgavu śhrīvegaḍeśhum̐ḍa nenu
tagulaidi miṁpulagum̐ dagavegadā