ఎందాఁకాఁ జేసేవు యెడలేని తరితీపు
(॥పల్లవి॥)
ఎందాఁకాఁ జేసేవు యెడలేని తరితీపు
కందువ మా విన్నపాలు గైకొనరాదా
(॥ఎందాఁకా॥)
ననుపు నీ సెలవికి నవ్వు లెన్నియైనా వచ్చు
అనువుగానూరకే మాటాడఁగరాదా
చెనకేవేళనే నీకు సిగ్గులెందుండైనా వచ్చు
వునికిగా నిట్టె నా వొద్దఁ గూచుండిరాదా
(॥ఎందాఁకా॥)
పలుమారు నీమతికి పరాకెంతైనా వచ్చు
చెలరేఁగి నీ యాతుమ చెప్పఁగరాదా
బలిమిఁ బెనఁగేవేళ పనులెందుండైనా వచ్చు
వెలయఁగ నా చేతివిడె మందుకోరాదా
(॥ఎందాఁకా॥)
అంకెలఁ గూడేయప్పుడే అలపెందుండైనా వచ్చు
సంకుల నీ నేరుపెల్లఁ జూపఁగరాదా
లంకెల శ్రీ వేంకటేశ లావు లెందుండైనా వచ్చు
పొంకపు నాగాఁగిటిలోఁ బొసఁగుండరాదా
(||pallavi||)
ĕṁdām̐kām̐ jesevu yĕḍaleni taridību
kaṁduva mā vinnabālu gaigŏnarādā
(||ĕṁdām̐kā||)
nanubu nī sĕlavigi navvu lĕnniyainā vachchu
anuvugānūrage māḍāḍam̐garādā
sĕnageveḽane nīgu siggulĕṁduṁḍainā vachchu
vunigigā niṭṭĕ nā vŏddam̐ gūsuṁḍirādā
(||ĕṁdām̐kā||)
palumāru nīmadigi parāgĕṁtainā vachchu
sĕlarem̐gi nī yāduma sĕppam̐garādā
balimim̐ bĕnam̐geveḽa panulĕṁduṁḍainā vachchu
vĕlayam̐ga nā sediviḍĕ maṁdugorādā
(||ĕṁdām̐kā||)
aṁkĕlam̐ gūḍeyappuḍe alabĕṁduṁḍainā vachchu
saṁkula nī nerubĕllam̐ jūbam̐garādā
laṁkĕla śhrī veṁkaḍeśha lāvu lĕṁduṁḍainā vachchu
pŏṁkabu nāgām̐giḍilom̐ bŏsam̐guṁḍarādā