ఎందాఁకాఁ జెప్పెంపీ సుద్దు లీడ కిట్టె రమ్మనవే
(॥పల్లవి॥)
ఎందాఁకాఁ జెప్పెంపీ సుద్దు లీడ కిట్టె రమ్మనవే
పొందికైన తలపోఁత భోగించక తీరునా
(॥ఎందాఁ॥)
విన్న వినుకలిచేత వేడుకైనవలపులు
కన్నులఁజూచినఁగాక కాంక్ష దీరునా
సన్నలఁజూపిన మోవి చాయలఁబుట్టినతీపు
అన్నిటాఁ జవిగొనక యాస దీరునా
(॥ఎందా॥)
మనునఁ బెనగొన్న మరవరానికోరిక
తనువులు సోఁకక తమి దీరునా
పనివడి మునుపనె పాఁగినచుట్టరికము
అనిశముఁగూడియుండ కాఁకటలు దీరునా
(॥ఎందా॥)
తెరమరఁగున నుండే తేట పడ్డ సిగ్గులు
పరపుపైఁ బండక గొబ్బనఁ దీరునా
యిరవై శ్రీవేంకటేశుఁడిట్టెవచ్చి నన్నుఁ గూడె
వరుసకు వచ్చితేఁ గావరములు దీరునా
(||pallavi||)
ĕṁdām̐kām̐ jĕppĕṁpī suddu līḍa kiṭṭĕ rammanave
pŏṁdigaina talabom̐ta bhogiṁchaga tīrunā
(||ĕṁdām̐||)
vinna vinugaliseda veḍugainavalabulu
kannulam̐jūsinam̐gāga kāṁkṣha dīrunā
sannalam̐jūbina movi sāyalam̐buṭṭinadību
anniḍām̐ javigŏnaga yāsa dīrunā
(||ĕṁdā||)
manunam̐ bĕnagŏnna maravarānigoriga
tanuvulu som̐kaga tami dīrunā
panivaḍi munubanĕ pām̐ginasuṭṭarigamu
aniśhamum̐gūḍiyuṁḍa kām̐kaḍalu dīrunā
(||ĕṁdā||)
tĕramaram̐guna nuṁḍe teḍa paḍḍa siggulu
parabubaim̐ baṁḍaga gŏbbanam̐ dīrunā
yiravai śhrīveṁkaḍeśhum̐ḍiṭṭĕvachchi nannum̐ gūḍĕ
varusagu vachchidem̐ gāvaramulu dīrunā