Emdaamkaam goluvu sese renni levu panulu

ఎందాఁకాఁ గొలువు సేసే రెన్ని లేవు పనులు
Language

(॥పల్లవి॥)
ఎందాఁకాఁ గొలువు సేసే రెన్ని లేవు పనులు
అంది ముచ్చటలు మీలో నాడరయ్య ఇఁకను

(॥ఎందా॥)
కప్పురవిడెము నదే కస్తూరి వూసుకో నదే
దప్పికిఁ బన్నీరదే దండ నున్నది
చెప్పినవూడిగాలకు చెంతనె కాచుకుండేము
వొప్పుగ నేకతమున నుండరయ్య యిఁకను

(॥ఎందా॥)
విరులదండ లివిగో విసరుకో సురటిదే
పరగఁ బరచితిమి పానుపూ నిదే
అరసి యేమైనా మీ రానతిచ్చితేఁ జేసేము
వొరిమెతోఁ బవ్వళించి వుండరయ్య యిఁకను

(॥ఎందా॥)
ఆరగించఁ గజ్జాయము అదిగో పానకము
కోరి యలమేల్మంగతోఁ గూడిననీకు
ఈరీతి శ్రీవేంకటేశ యిక్కడనే వున్నారము
కూరిమి మీయలపార్చుకొనరయ్య యిఁకను

(||pallavi||)
ĕṁdām̐kām̐ gŏluvu sese rĕnni levu panulu
aṁdi muchchaḍalu mīlo nāḍarayya im̐kanu

(||ĕṁdā||)
kappuraviḍĕmu nade kastūri vūsugo nade
dappigim̐ bannīrade daṁḍa nunnadi
sĕppinavūḍigālagu sĕṁtanĕ kāsuguṁḍemu
vŏppuga negadamuna nuṁḍarayya yim̐kanu

(||ĕṁdā||)
viruladaṁḍa livigo visarugo suraḍide
paragam̐ barasidimi pānubū nide
arasi yemainā mī rānadichchidem̐ jesemu
vŏrimĕdom̐ bavvaḽiṁchi vuṁḍarayya yim̐kanu

(||ĕṁdā||)
āragiṁcham̐ gajjāyamu adigo pānagamu
kori yalamelmaṁgadom̐ gūḍinanīgu
īrīdi śhrīveṁkaḍeśha yikkaḍane vunnāramu
kūrimi mīyalabārsugŏnarayya yim̐kanu