Emdaamkaam gaasugumdu nevanida vachchuno

ఎందాఁకాఁ గాచుకుండు నేవనిత వచ్చునో
Language

(॥పల్లవి॥)
ఎందాఁకాఁ గాచుకుండు నేవనిత వచ్చునో
చెందిన వుపకారము చేకొనవయ్యా

(॥ఎందాఁ॥)
గట్టిచనుఁగవ నిట్టె కానుకియ్యవచ్చె నాపె
చుట్టవువరసమేలు చూపవచ్చెను
వెట్టదీర మోవితేనె విందుచెప్పవచ్చె నాపె
గుట్టుతోఁ బొడచూపించుకొనఁగదవయ్యా

(॥ఎందాఁ॥)
చిక్కనిజవ్వనరాజ్యసీమ న(ని?) న్నేలించవచ్చె
పెక్కుత(వ?) లపులు వెదవెట్టవచ్చెను
ఇక్కువనేత్రచకోరా లింపులు చూపఁగవచ్చె
అక్కజాన నన్నీఁ జూచి ఆదరించవయ్యా

(॥ఎందాఁ॥)
కాఁగిటిసమ్మంధము కలయఁ జెప్పఁగవచ్చె
చేఁగదేర సేవలెల్లఁ జేయవచ్చెను
వీఁగక శ్రీవేంకటేశ వేడుక నన్నే లితివి
ఆంగి రతిఁదమకించీ నలపు దేర్చవయ్యా

(||pallavi||)
ĕṁdām̐kām̐ gāsuguṁḍu nevanida vachchuno
sĕṁdina vubagāramu segŏnavayyā

(||ĕṁdām̐||)
gaṭṭisanum̐gava niṭṭĕ kānugiyyavachchĕ nābĕ
suṭṭavuvarasamelu sūbavachchĕnu
vĕṭṭadīra movidenĕ viṁdusĕppavachchĕ nābĕ
guṭṭudom̐ bŏḍasūbiṁchugŏnam̐gadavayyā

(||ĕṁdām̐||)
sikkanijavvanarājyasīma na(ni?) nneliṁchavachchĕ
pĕkkuda(va?) labulu vĕdavĕṭṭavachchĕnu
ikkuvanetrasagorā liṁpulu sūbam̐gavachchĕ
akkajāna nannīm̐ jūsi ādariṁchavayyā

(||ĕṁdām̐||)
kām̐giḍisammaṁdhamu kalayam̐ jĕppam̐gavachchĕ
sem̐gadera sevalĕllam̐ jeyavachchĕnu
vīm̐gaga śhrīveṁkaḍeśha veḍuga nanne lidivi
āṁgi radim̐damagiṁchī nalabu dersavayyā