Emdaamkaa vinnabaalu yemi sesevu

ఎందాఁకా విన్నపాలు యేమి సేసేవు
Language

(॥పల్లవి॥)
ఎందాఁకా విన్నపాలు యేమి సేసేవు
కందువలు చూపఁగానే కరఁగీ నీ మనసు

(॥ఎందాఁ॥)
యిచ్చకములే నీకు నెటువలె నాడవచ్చు
వెచ్చని వలపులే యెట్టు వేయవచ్చును
పచ్చికస్తూరి నూరి పట్టువెట్టుకొని వచ్చి
తచ్చి నీవద్దనుండఁగా దయవుట్టీఁ దానె

(॥ఎందాఁ॥)
కూరిములే సారె సారెఁ గొసరఁగ నెట్టు వచ్చు
ఆరీతిఁ గన్ను లెట్టార్చవచ్చును
గారవాన నిమ్మ పండు కాంతవట్టుకవుంటే
నేరుపులు మించఁ గరుణించేవు నీవే

(॥ఎందాఁ॥)
నయగారాల కెందాఁకా నవ్వులు నవ్వఁగవచ్చు
క్రియెఱిఁగిన నిన్నెట్టు గెలువవచ్చు
నియతి శ్రీ వేంకటేశ నిన్ను నేఁ గూడివుందాన
జయముగా రతులెల్లా చవివుట్టే నివుడె

(||pallavi||)
ĕṁdām̐kā vinnabālu yemi sesevu
kaṁduvalu sūbam̐gāne karam̐gī nī manasu

(||ĕṁdām̐||)
yichchagamule nīgu nĕḍuvalĕ nāḍavachchu
vĕchchani valabule yĕṭṭu veyavachchunu
pachchigastūri nūri paṭṭuvĕṭṭugŏni vachchi
tachchi nīvaddanuṁḍam̐gā dayavuṭṭīm̐ dānĕ

(||ĕṁdām̐||)
kūrimule sārĕ sārĕm̐ gŏsaram̐ga nĕṭṭu vachchu
ārīdim̐ gannu lĕṭṭārsavachchunu
gāravāna nimma paṁḍu kāṁtavaṭṭugavuṁṭe
nerubulu miṁcham̐ garuṇiṁchevu nīve

(||ĕṁdām̐||)
nayagārāla kĕṁdām̐kā navvulu navvam̐gavachchu
kriyĕṟim̐gina ninnĕṭṭu gĕluvavachchu
niyadi śhrī veṁkaḍeśha ninnu nem̐ gūḍivuṁdāna
jayamugā radulĕllā savivuṭṭe nivuḍĕ