ఎందాఁకా వేఁడుకొనేవు యేఁటికయ్యా
(॥పల్లవి॥)
ఎందాఁకా వేఁడుకొనేవు యేఁటికయ్యా
అంది పొంది యింకా నిన్ను అటమటించేనా
(॥ఎందా॥)
అలుకలేఁటికి నిఁక నంతరంగ మొక్కటాయ
బలిమి యేఁటికి నీతోఁ బలికితిని
సొలపులేఁటికి నీసుద్దులు సమ్మతించితి
మలసి యప్పటి నీతో మరికాదనేనా
(॥ఎందా॥)
వట్టిసొలపులేఁటికి వద్దనే వుందాన నేను
తిట్టనేల నేమోహము తెలిసితిని
పట్టి కొసరఁగనేల పనులెల్లాఁ జేసే నీకు
మట్టుమీరి యంతలోనే మరి కాదనేనా
(॥ఎందా॥)
జంకించనేఁటికి నీచనవెల్లాఁ జేకొంటి
వుంకువలేఁటికి నీతో నొద్దికైతివి
అంకెల శ్రీవేంకటేశ అన్నిటా నిన్నుఁ గూడితి
మంకు వాసె నాతోను మరి కాదనేనా
(||pallavi||)
ĕṁdām̐kā vem̐ḍugŏnevu yem̐ṭigayyā
aṁdi pŏṁdi yiṁkā ninnu aḍamaḍiṁchenā
(||ĕṁdā||)
alugalem̐ṭigi nim̐ka naṁtaraṁga mŏkkaḍāya
balimi yem̐ṭigi nīdom̐ baligidini
sŏlabulem̐ṭigi nīsuddulu sammadiṁchidi
malasi yappaḍi nīdo marigādanenā
(||ĕṁdā||)
vaṭṭisŏlabulem̐ṭigi vaddane vuṁdāna nenu
tiṭṭanela nemohamu tĕlisidini
paṭṭi kŏsaram̐ganela panulĕllām̐ jese nīgu
maṭṭumīri yaṁtalone mari kādanenā
(||ĕṁdā||)
jaṁkiṁchanem̐ṭigi nīsanavĕllām̐ jegŏṁṭi
vuṁkuvalem̐ṭigi nīdo nŏddigaidivi
aṁkĕla śhrīveṁkaḍeśha anniḍā ninnum̐ gūḍidi
maṁku vāsĕ nādonu mari kādanenā