ఎందాఁకా వట్టిజోలి యిద్దరు మీరొక్కటే
(॥పల్లవి॥)
ఎందాఁకా వట్టిజోలి యిద్దరు మీరొక్కటే
అందుకోరయ్య విడేలు ఆకె నీవు నిపుడు
(॥ఎందాఁక॥)
అలుకలఁ బొద్దుగూఁకె నాసలనే తెల్ల వారె
చలము వొట్లనే జామెక్కెను
చెలపలచెమటలు చెక్కులపైఁ గారజొచ్చె
అలసితిరి కాఁగిట నలముకోరయ్యా
(॥ఎందాఁక॥)
చింతల చీకటివడె సిగ్గులనెల వొడచె
వింతవింతనవ్వులనే వెన్నెల గాసె
పంతాలు మీలోలోనే బయలువందలి వాఁకె
యింత లేలుకొంటిరి మీ రిఁకఁ గూడరయ్యా
(॥ఎందాఁక॥)
విరహము లెండగాసె వేడుకలు మొయిలు గప్పె
సరసపుచేఁతల వసంతము వచ్చె
యిరవై శ్రీవేంకటేశ యికె యలమేల్మంగ
మరిగితిరి మీరు నెమ్మది నుండరయ్యా
(||pallavi||)
ĕṁdām̐kā vaṭṭijoli yiddaru mīrŏkkaḍe
aṁdugorayya viḍelu āgĕ nīvu nibuḍu
(||ĕṁdām̐ka||)
alugalam̐ bŏddugūm̐kĕ nāsalane tĕlla vārĕ
salamu vŏṭlane jāmĕkkĕnu
sĕlabalasĕmaḍalu sĕkkulabaim̐ gārajŏchchĕ
alasidiri kām̐giḍa nalamugorayyā
(||ĕṁdām̐ka||)
siṁtala sīgaḍivaḍĕ siggulanĕla vŏḍasĕ
viṁtaviṁtanavvulane vĕnnĕla gāsĕ
paṁtālu mīlolone bayaluvaṁdali vām̐kĕ
yiṁta lelugŏṁṭiri mī rim̐kam̐ gūḍarayyā
(||ĕṁdām̐ka||)
virahamu lĕṁḍagāsĕ veḍugalu mŏyilu gappĕ
sarasabusem̐tala vasaṁtamu vachchĕ
yiravai śhrīveṁkaḍeśha yigĕ yalamelmaṁga
marigidiri mīru nĕmmadi nuṁḍarayyā