ఎందాఁకా వట్టిజోలి యెంతవొద్దువోయ నేఁడు
(॥పల్లవి॥)
ఎందాఁకా వట్టిజోలి యెంతవొద్దువోయ నేఁడు
ఇందరుఁ జుట్టాలే మా ఇంటికి రావయ్యా
(॥ఎందా॥)
మాటలెన్నైనాఁ గలవు మళ్లి యాడేమంటి
జూటుఁదనాలునేర్చినసుదతులకు
కూటువగూడినయట్టికొలువులొ నాడితేను
యేఁటికి వినేవు మాయింటికి రావయ్యా
(॥ఎందా॥)
చేఁత లెన్నైనాఁ గలవు చేకొని సేసేమంటే
పూఁతనవ్వులఁదేలించేపొలఁతులకు
బాఁతిపడి యిందుకెల్లా భ్రమయనేఁటికి నీకు
యీఁతకు లోఁతున్నదా మాఇంటికి రావయ్యా
(॥ఎందా॥)
చూపలెన్నై నాఁ గలవు సొలసి చూచేమంటే
తీపుల మోవులు చూపే తెఱవలకు
చేపట్టి నన్నేలితివి శ్రీవేంకటేశ్వర
యీపాటిఁ గరుణించి మాయింటికి రావయ్యా
(||pallavi||)
ĕṁdām̐kā vaṭṭijoli yĕṁtavŏdduvoya nem̐ḍu
iṁdarum̐ juṭṭāle mā iṁṭigi rāvayyā
(||ĕṁdā||)
māḍalĕnnainām̐ galavu maḽli yāḍemaṁṭi
jūḍum̐danālunersinasudadulagu
kūḍuvagūḍinayaṭṭigŏluvulŏ nāḍidenu
yem̐ṭigi vinevu māyiṁṭigi rāvayyā
(||ĕṁdā||)
sem̐ta lĕnnainām̐ galavu segŏni sesemaṁṭe
pūm̐tanavvulam̐deliṁchebŏlam̐tulagu
bām̐tibaḍi yiṁdugĕllā bhramayanem̐ṭigi nīgu
yīm̐tagu lom̐tunnadā māiṁṭigi rāvayyā
(||ĕṁdā||)
sūbalĕnnai nām̐ galavu sŏlasi sūsemaṁṭe
tībula movulu sūbe tĕṟavalagu
sebaṭṭi nannelidivi śhrīveṁkaḍeśhvara
yībāḍim̐ garuṇiṁchi māyiṁṭigi rāvayyā