Emdaamkaa vattijoli yela sesevu

ఎందాఁకా వట్టిజోలి యేల సేసేవు
Language

(॥పల్లవి॥)
ఎందాఁకా వట్టిజోలి యేల సేసేవు
కందువకు వచ్చితివి కరుణించు మిఁకను

(॥ఎందాఁ॥)
కొత్త కొత్త మాట లాడి కొమ్మ నీపదాలు వాడీ
చిత్తగించి వినవయ్య సిగ్గులేఁటికి
గుత్తపుగుబ్బలు చూపి గురుతు నీమై మోపీ
బత్తి చేకొని యాపెనుఁ బైకొనఁగరాదా

(॥ఎందాఁ॥)
కన్నులఁ దప్పక చూచి కాఁపురములకు లాచీ
మన్నించి ఇంతటనైనా మాటాడరాదా
సన్నలనే మోని ఇచ్చి సముకాన నిన్ను మెచ్చీ
చెన్నుమీరఁ గాఁపురాలు సేయఁగరాదా

(॥ఎందాఁ॥)
కూరిములు నీపై నించి గుట్టుతో రతికి బొంచీ
గారవించి వేడుకతోఁ గైకొనరాదా
చేరి నన్ను నేలితివి శ్రీవేంకటేశ్వర నేఁడు
నారుకొన నీపెతోడా నవ్వఁగరాదా

(||pallavi||)
ĕṁdām̐kā vaṭṭijoli yela sesevu
kaṁduvagu vachchidivi karuṇiṁchu mim̐kanu

(||ĕṁdām̐||)
kŏtta kŏtta māḍa lāḍi kŏmma nībadālu vāḍī
sittagiṁchi vinavayya siggulem̐ṭigi
guttabugubbalu sūbi gurudu nīmai mobī
batti segŏni yābĕnum̐ baigŏnam̐garādā

(||ĕṁdām̐||)
kannulam̐ dappaga sūsi kām̐puramulagu lāsī
manniṁchi iṁtaḍanainā māḍāḍarādā
sannalane moni ichchi samugāna ninnu mĕchchī
sĕnnumīram̐ gām̐purālu seyam̐garādā

(||ĕṁdām̐||)
kūrimulu nībai niṁchi guṭṭudo radigi bŏṁchī
gāraviṁchi veḍugadom̐ gaigŏnarādā
seri nannu nelidivi śhrīveṁkaḍeśhvara nem̐ḍu
nārugŏna nībĕdoḍā navvam̐garādā