ఎందాఁకా వట్టి జోలి యెఱఁగనా నేఁ దొల్లి
(॥పల్లవి॥)
ఎందాఁకా వట్టి జోలి యెఱఁగనా నేఁ దొల్లి
చందమాయ సుద్దులెల్ల చాలుఁ జాలు నిఁకను
(॥ఎందాఁ॥)
చెప్పుమంటా నన్ను నేల చేరి వెడ్డు వెట్టేవు
తప్పక చూచితేనే తలవంచితి
దప్పిదేరి నీమోవి దగదొట్టీ నిందువంక
చప్పుచారై యలసేవు చాలుఁ జాలు నిఁకను
(॥ఎందాఁ॥)
ప్రియములు చెప్పి యేల పెనఁగ వచ్చేవు నాతో
నయములు చూపఁగాను నవ్వు నవ్వితి
క్రియలెల్లఁ గానవచ్చీ కేలు మీఁదై యిందువంక
జయమాయ వేగిరాలు చాలుఁ జాలు నిఁకను
(॥ఎందాఁ॥)
కొంగువట్టి తీసి యేల కూడితి వింతటిలోనె
ముంగిటికి నీవు రాఁగా మోహించితి
అంగమాయ శ్రీ వేంకటాధిపతి ఇందువంక
జంగిలి కొసరు లెల్ల చాలుఁ జాలు నికను
(||pallavi||)
ĕṁdām̐kā vaṭṭi joli yĕṟam̐ganā nem̐ dŏlli
saṁdamāya suddulĕlla sālum̐ jālu nim̐kanu
(||ĕṁdām̐||)
sĕppumaṁṭā nannu nela seri vĕḍḍu vĕṭṭevu
tappaga sūsidene talavaṁchidi
dappideri nīmovi dagadŏṭṭī niṁduvaṁka
sappusārai yalasevu sālum̐ jālu nim̐kanu
(||ĕṁdām̐||)
priyamulu sĕppi yela pĕnam̐ga vachchevu nādo
nayamulu sūbam̐gānu navvu navvidi
kriyalĕllam̐ gānavachchī kelu mīm̐dai yiṁduvaṁka
jayamāya vegirālu sālum̐ jālu nim̐kanu
(||ĕṁdām̐||)
kŏṁguvaṭṭi tīsi yela kūḍidi viṁtaḍilonĕ
muṁgiḍigi nīvu rām̐gā mohiṁchidi
aṁgamāya śhrī veṁkaḍādhibadi iṁduvaṁka
jaṁgili kŏsaru lĕlla sālum̐ jālu niganu