ఎందాఁకా వట్టి జాగులేల సేసేవే
(॥పల్లవి॥)
ఎందాఁకా వట్టి జాగులేల సేసేవే
సందడించి వలపులు జాజుకొనఁగాను
(॥ఎందా॥)
సిగ్గులు వడుదురా శిరసు వంచుదురా
దగ్గరి కూచుండి పతి తలఁపించఁగా
వొగ్గి అందుకోకుందురా వూరకే వుండుదురా
వెగ్గళించి యాతఁడు విడెమియ్యఁగాను
(॥ఎందా॥)
కన్నెపడుచువా నీవు కడుముద్దరాలవా
మిన్నక లోఁగేవు పతి మేలమాడఁగా
మన్నన నెఱఁగవా మనసు సోదించేవా
విన్నంతనే పలుకవు వేఁడుకోఁగాను
(॥ఎందా॥)
కప్పుర మియ్యఁగవద్దా కాఁగిలించుకొనవద్దా
యిప్పడె శ్రీవేంకటేశుఁ డెనసె నిన్ను
చెప్పినట్టు సేయవద్దా సేవల మెప్పించవద్దా
తప్ప కాతఁ డప్పటిని తమకించఁగాను
(||pallavi||)
ĕṁdām̐kā vaṭṭi jāgulela seseve
saṁdaḍiṁchi valabulu jājugŏnam̐gānu
(||ĕṁdā||)
siggulu vaḍudurā śhirasu vaṁchudurā
daggari kūsuṁḍi padi talam̐piṁcham̐gā
vŏggi aṁdugoguṁdurā vūrage vuṁḍudurā
vĕggaḽiṁchi yādam̐ḍu viḍĕmiyyam̐gānu
(||ĕṁdā||)
kannĕbaḍusuvā nīvu kaḍumuddarālavā
minnaga lom̐gevu padi melamāḍam̐gā
mannana nĕṟam̐gavā manasu sodiṁchevā
vinnaṁtane palugavu vem̐ḍugom̐gānu
(||ĕṁdā||)
kappura miyyam̐gavaddā kām̐giliṁchugŏnavaddā
yippaḍĕ śhrīveṁkaḍeśhum̐ ḍĕnasĕ ninnu
sĕppinaṭṭu seyavaddā sevala mĕppiṁchavaddā
tappa kādam̐ ḍappaḍini tamagiṁcham̐gānu