ఎందాఁకా సింగారించే వింటిలోనను
(॥పల్లవి॥)
ఎందాఁకా సింగారించే వింటిలోనను
అంది నిన్నుఁ బెండ్లాడే యాసతో నున్నాఁడు
(॥ఎందాఁ॥)
పలుకవే జవరాల పతితోడను
నెలకొని నీ యెదుట నిలుచున్నాఁడు
చిలుకవే నగవులు సెలవులను । నీ -
కలయికలకు నిదె కాచుకున్నాఁడు
(॥ఎందాఁ॥)
వొసఁగవే విడె మిట్టె వుబ్బురేఁగను
కొసరుచు నినుఁ గనుఁగొంటా నున్నాఁడు
పొసఁగవే యాతని పొందులను
వసమై నీ కాఁగిటికి వలచివున్నాడు
(॥ఎందాఁ॥)
వోరయనే చన్నుల నీ వుదుటు చూపి
గరిమ నిన్నేలె శ్రీవేంకటేశ్వరుఁడు
దొరయవే రతులను తోడఁదోడను
సొరిది నీ చేఁతులకుఁ జొక్కివున్నాఁడు
(||pallavi||)
ĕṁdām̐kā siṁgāriṁche viṁṭilonanu
aṁdi ninnum̐ bĕṁḍlāḍe yāsado nunnām̐ḍu
(||ĕṁdām̐||)
palugave javarāla padidoḍanu
nĕlagŏni nī yĕduḍa nilusunnām̐ḍu
silugave nagavulu sĕlavulanu | nī -
kalayigalagu nidĕ kāsugunnām̐ḍu
(||ĕṁdām̐||)
vŏsam̐gave viḍĕ miṭṭĕ vubburem̐ganu
kŏsarusu ninum̐ ganum̐gŏṁṭā nunnām̐ḍu
pŏsam̐gave yādani pŏṁdulanu
vasamai nī kām̐giḍigi valasivunnāḍu
(||ĕṁdām̐||)
vorayane sannula nī vuduḍu sūbi
garima ninnelĕ śhrīveṁkaḍeśhvarum̐ḍu
dŏrayave radulanu toḍam̐doḍanu
sŏridi nī sem̐tulagum̐ jŏkkivunnām̐ḍu