ఎందాఁకా సిగ్గువడే వింతవొద్దు వోయ నేఁడు
(॥పల్లవి॥)
ఎందాఁకా సిగ్గువడే వింతవొద్దు వోయ నేఁడు
కందున నాతఁ డన్నట్టె కానిమ్మనరాదా
(॥ఎందాఁ॥)
చన విచ్చి నీదిక్కె చక్కఁ జూచీ సారె సారె
మన సిచ్చి యాతనితో మాటలాడవే
పెనఁగీ నప్పటినుండి ప్రియపడి నీ తోను
యెనసే నని యింతట నియ్యకొనరాదా
(॥ఎందాఁ॥)
వెన్నెల నీ కెదురై వాకిట నిలుచున్నాఁడు
వున్నతిఁ జేవట్టి లోని కొగిఁ దియ్యవే
తన్నుఁదానె యెంతలోనె దగ్గరఁ గూచుండె నీకు
సన్నల నీ వాతనికే సమ్మతించరాదా
(॥ఎందాఁ॥)
చేయిఁ జేయి మోపి నీపై సేసవెట్టు కున్నవాఁడు
పాయక నీతలఁబాలు పైఁ జల్లరాదా
యీయెడ శ్రీవేంకటేశుఁ డిదె నీకాఁగిటఁ గూడె
చేయెత్తి యలమేల్మంగ చేరి మొక్క రాదా
(||pallavi||)
ĕṁdām̐kā sigguvaḍe viṁtavŏddu voya nem̐ḍu
kaṁduna nādam̐ ḍannaṭṭĕ kānimmanarādā
(||ĕṁdām̐||)
sana vichchi nīdikkĕ sakkam̐ jūsī sārĕ sārĕ
mana sichchi yādanido māḍalāḍave
pĕnam̐gī nappaḍinuṁḍi priyabaḍi nī tonu
yĕnase nani yiṁtaḍa niyyagŏnarādā
(||ĕṁdām̐||)
vĕnnĕla nī kĕdurai vāgiḍa nilusunnām̐ḍu
vunnadim̐ jevaṭṭi loni kŏgim̐ diyyave
tannum̐dānĕ yĕṁtalonĕ daggaram̐ gūsuṁḍĕ nīgu
sannala nī vādanige sammadiṁcharādā
(||ĕṁdām̐||)
seyim̐ jeyi mobi nībai sesavĕṭṭu kunnavām̐ḍu
pāyaga nīdalam̐bālu paim̐ jallarādā
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍidĕ nīgām̐giḍam̐ gūḍĕ
seyĕtti yalamelmaṁga seri mŏkka rādā