ఎందాఁకా సిగ్గువడే రిద్దరు మీరు
(॥పల్లవి॥)
ఎందాఁకా సిగ్గువడే రిద్దరు మీరు
సందడింపు వలపులె చవులు గాక
(॥॥)
చలమరితనమేల సరి నాలిమగనికి
వెలలేనికూటమే వేడుకగాక
తలవంచుకొని లోలో తడఁబాట్లిఁక నేల
సొలపుఁ జూపులు నేఁడు సొంపులు గాక
(॥॥)
పెట్టనిబిగువులేల ప్రియముగలవారికి
నెట్టుకొన్న నవ్వులే నేర్పులు గాక
రట్టుతో యెడమాఁట వట్టిరాఁపు లవియేల
దట్టపుఁ గాఁగిళ్లు శుభదములై యుండుఁగాక
(॥॥)
తచ్చనలు చూపనేల తమకించేవారికి
పచ్చిమోవు లొనఁగుటే పంతాలుగాక
యిచ్చగించి శ్రీ వేంకటేశ కూడితిరి మీరు
విచ్చలవిడిపొందులే వేడుకలుగాక
(||pallavi||)
ĕṁdām̐kā sigguvaḍe riddaru mīru
saṁdaḍiṁpu valabulĕ savulu gāga
(||||)
salamaridanamela sari nālimaganigi
vĕlalenigūḍame veḍugagāga
talavaṁchugŏni lolo taḍam̐bāṭlim̐ka nela
sŏlabum̐ jūbulu nem̐ḍu sŏṁpulu gāga
(||||)
pĕṭṭanibiguvulela priyamugalavārigi
nĕṭṭugŏnna navvule nerbulu gāga
raṭṭudo yĕḍamām̐ṭa vaṭṭirām̐pu laviyela
daṭṭabum̐ gām̐giḽlu śhubhadamulai yuṁḍum̐gāga
(||||)
tachchanalu sūbanela tamagiṁchevārigi
pachchimovu lŏnam̐guḍe paṁtālugāga
yichchagiṁchi śhrī veṁkaḍeśha kūḍidiri mīru
vichchalaviḍibŏṁdule veḍugalugāga