ఎందాఁకా సిగ్గులువడే వేమయ్యా
(॥పల్లవి॥)
ఎందాఁకా సిగ్గులువడే వేమయ్యా
ఇందుముఖి కేకతాన నియ్యవయ్య చనవు
(॥॥)
సొలసి సొలసి నిన్ను సుదతి గొసరఁగాను
పలుమారు నీకెక్కడ పరాకయ్యా
కలువపువ్వుల వేసి కందువలు చూపఁగాను
వలవంత నీవిట్టే యెవ్వరిఁ జూచేవయ్యా
(॥॥)
తగిలి తగిలి నీతో తతిగొని నవ్వఁగాను
వొగి నీచిత్తమెక్కడ నున్నదయ్యా
మొగము చూచి నీకు మొక్కులెల్లా మొక్కఁగాను
జిగిమీర నీవేల శిరసెత్తవయ్యా
(॥॥)
చెనకి చెనకి యీకె చేరి నిన్నుఁ గూడఁగాను
యెనలేని నివ్వెరఁగు లిఁకనేలయ్యా
ఘనుఁడ శ్రీవేంకటేశ కాఁగిలించె నీదేవులు
గొనగొన్నరతి నెంత గుట్టుచూపేవయ్యా
(||pallavi||)
ĕṁdām̐kā sigguluvaḍe vemayyā
iṁdumukhi kegadāna niyyavayya sanavu
(||||)
sŏlasi sŏlasi ninnu sudadi gŏsaram̐gānu
palumāru nīgĕkkaḍa parāgayyā
kaluvabuvvula vesi kaṁduvalu sūbam̐gānu
valavaṁta nīviṭṭe yĕvvarim̐ jūsevayyā
(||||)
tagili tagili nīdo tadigŏni navvam̐gānu
vŏgi nīsittamĕkkaḍa nunnadayyā
mŏgamu sūsi nīgu mŏkkulĕllā mŏkkam̐gānu
jigimīra nīvela śhirasĕttavayyā
(||||)
sĕnagi sĕnagi yīgĕ seri ninnum̐ gūḍam̐gānu
yĕnaleni nivvĕram̐gu lim̐kanelayyā
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kām̐giliṁchĕ nīdevulu
gŏnagŏnnaradi nĕṁta guṭṭusūbevayyā