Emdaamkaa sarasamu lemi yaadevu

ఎందాఁకా సరసము లేమి యాడేవు
Language

(॥పల్లవి॥)
ఎందాఁకా సరసము లేమి యాడేవు
కందువ రతుల నిఁక గరుణించవయ్యా

(॥ఎందాఁ॥)
ముచ్చటమాఁటలు చెప్పి మోహములే పచరించి
యిచ్చకములే సేసిని యింతి నీకును
కచ్చుపెట్టి యిటువంటికాంతలనలపు నీవు
పచ్చిసేయఁ దగ దింకఁ బాలించవయ్యా

(॥ఎందాఁ॥)
హత్తి కొలువుసేసి ఆయాలు గరఁగ నవ్వి
బత్తి నీపైఁ బచరించీఁ బలు మారును
చిత్తగించి యాపె సేసేసేవలు నీ విప్పుడు
వొత్తి గరిసించనేల వొనగూడవయ్యా

(॥ఎందాఁ॥)
కందువ నిలుచుండి కప్పుర విడెమిచ్చి
పొందులెల్లా నెరపీనిపొసఁగ నేఁడు
అంది శ్రీ వేంకటేశుఁ డ యంతలోనే కూడితిని
అందుకోలు సిగ్గులేల ఆదరించవయ్యా

(||pallavi||)
ĕṁdām̐kā sarasamu lemi yāḍevu
kaṁduva radula nim̐ka garuṇiṁchavayyā

(||ĕṁdām̐||)
muchchaḍamām̐ṭalu sĕppi mohamule pasariṁchi
yichchagamule sesini yiṁti nīgunu
kachchubĕṭṭi yiḍuvaṁṭigāṁtalanalabu nīvu
pachchiseyam̐ daga diṁkam̐ bāliṁchavayyā

(||ĕṁdām̐||)
hatti kŏluvusesi āyālu garam̐ga navvi
batti nībaim̐ basariṁchīm̐ balu mārunu
sittagiṁchi yābĕ sesesevalu nī vippuḍu
vŏtti garisiṁchanela vŏnagūḍavayyā

(||ĕṁdām̐||)
kaṁduva nilusuṁḍi kappura viḍĕmichchi
pŏṁdulĕllā nĕrabīnibŏsam̐ga nem̐ḍu
aṁdi śhrī veṁkaḍeśhum̐ ḍa yaṁtalone kūḍidini
aṁdugolu siggulela ādariṁchavayyā