Emdaamkaa norusugumde viduvamti tamagamu

ఎందాఁకా నోరుచుకుండే విటువంటి తమకము
Language

(॥పల్లవి॥)
ఎందాఁకా నోరుచుకుండే విటువంటి తమకము
అందుకొని యెడమాట లాడించరాదా

(॥॥)
చెప్పరాని మాటలంటా నిగ్గులువడఁగఁ బోతే
దెప్పదాన విభునికిఁ దెలిసే దెట్టు
కుప్పళించీఁ బెంజెమట గుట్టు నీవు నడపఁగ
విప్పుచుఁ జెలులచేత విన్నవింపించరాదా

(॥॥)
చిత్తమెద్దో యంటాను శిరసు వంచఁగఁ బోతే
హత్తినపతి కెచ్చరికయ్యే దెట్టు
పొత్తుల వూహలచేతఁ బులకించె మేనెల్ల
సత్తుగా లేకలు వ్రాసి చదివించరాదా

(॥॥)
పంతము దప్పీనంటా పరాకుసేసుక వుంటే
ఇంతలో శ్రీవేంకటేశుడెనసె నెట్టు
కాంతవలమేల్మంగ కళలెక్కె నీమోమున
సంతతపు రతులకు సన్న సేయరాదా

(||pallavi||)
ĕṁdām̐kā norusuguṁḍe viḍuvaṁṭi tamagamu
aṁdugŏni yĕḍamāḍa lāḍiṁcharādā

(||||)
sĕpparāni māḍalaṁṭā nigguluvaḍam̐gam̐ bode
dĕppadāna vibhunigim̐ dĕlise dĕṭṭu
kuppaḽiṁchīm̐ bĕṁjĕmaḍa guṭṭu nīvu naḍabam̐ga
vippusum̐ jĕlulaseda vinnaviṁpiṁcharādā

(||||)
sittamĕddo yaṁṭānu śhirasu vaṁcham̐gam̐ bode
hattinabadi kĕchcharigayye dĕṭṭu
pŏttula vūhalasedam̐ bulagiṁchĕ menĕlla
sattugā legalu vrāsi sadiviṁcharādā

(||||)
paṁtamu dappīnaṁṭā parāgusesuga vuṁṭe
iṁtalo śhrīveṁkaḍeśhuḍĕnasĕ nĕṭṭu
kāṁtavalamelmaṁga kaḽalĕkkĕ nīmomuna
saṁtadabu radulagu sanna seyarādā