ఎందాఁకా నిద్దిరించే వేమమ్మా
(॥పల్లవి॥)
ఎందాఁకా నిద్దిరించే వేమమ్మా
దిందుపడి వాకి లిఁకఁ దెరవవోయమ్మా
(॥ఎందాఁ॥)
రాతిరి యేమిటికో రమ్మంటి వట నీవు
ఆతఁడు వచ్చునాఁ డప్పటనుండీ
కాతరాన నీవు లోన గూడె వెట్టుకుండఁ గాను
యీతలఁ జెప్పమైతి మిందాఁకా నమ్మా
(॥ఎందాఁ॥)
యేమో కావలె నంటా యెంచుకొంటిరట వావి
ఆమాటే యిందాఁకాఁ జెప్పె నప్పటినుండి
నీమారుగ వాకిట నేము పచరించితిమి
ప్రేమతోడ లోనికి పిలుచుకోవమ్మా
(॥ఎందాఁ॥)
వుంగర మిచ్చితివట నుంకువగా నాతనికి
అంగవించి మాకుఁ జూపీ అప్పటినుండి
చెంగట చే గూడె దీసి శ్రీ వేంకటేశుఁడు చొచ్చి
వుంగిటిగా నిన్నుఁగూడె వొప్పుగొనవమ్మా
(||pallavi||)
ĕṁdām̐kā niddiriṁche vemammā
diṁdubaḍi vāgi lim̐kam̐ dĕravavoyammā
(||ĕṁdām̐||)
rādiri yemiḍigo rammaṁṭi vaḍa nīvu
ādam̐ḍu vachchunām̐ ḍappaḍanuṁḍī
kādarāna nīvu lona gūḍĕ vĕṭṭuguṁḍam̐ gānu
yīdalam̐ jĕppamaidi miṁdām̐kā nammā
(||ĕṁdām̐||)
yemo kāvalĕ naṁṭā yĕṁchugŏṁṭiraḍa vāvi
āmāḍe yiṁdām̐kām̐ jĕppĕ nappaḍinuṁḍi
nīmāruga vāgiḍa nemu pasariṁchidimi
premadoḍa lonigi pilusugovammā
(||ĕṁdām̐||)
vuṁgara michchidivaḍa nuṁkuvagā nādanigi
aṁgaviṁchi māgum̐ jūbī appaḍinuṁḍi
sĕṁgaḍa se gūḍĕ dīsi śhrī veṁkaḍeśhum̐ḍu sŏchchi
vuṁgiḍigā ninnum̐gūḍĕ vŏppugŏnavammā