Emdaamkaa nee sarasaalu yimta galadaa

ఎందాఁకా నీ సరసాలు యింత గలదా
Language

(॥పల్లవి॥)
ఎందాఁకా నీ సరసాలు యింత గలదా
కందువ నలపు దీరఁ గరుణించరాదా

(॥ఎందాఁకా॥)
చెక్కులెల్లఁ జెమరించె చేరి నీవు నవ్వించఁగా
వొక్కమాటే యింతైతే వోపునా చెలి
కక్కసించే వెంత నీవు కఠినచిత్తుఁడవో
నిక్కి మాకైతేఁ జూచి నీరాయ మనసు

(॥ఎందాఁకా॥)
ఆరగించ నెరఁగదు అట్టె కతలు చెప్పఁగా-
నీరీతి దినమునైతే యింతి వోపునా
దూరినా మానవు యెంత దోసానకు వెరవవో
సారె మాకైతేఁ జూచి జడిసీని దనువు

(॥ఎందాఁకా॥)
కడుదప్పి గొనె నిదె కాగిఁట నీవు గూడఁగ
కడగి పాయపుసతి కాఁక కోపునా
అడరి శ్రీవేంకటేశ ఆడికె కెంతోపుదువో
బడినున్న మాకైతేఁ బచ్చి దోఁచెఁబనులు

(||pallavi||)
ĕṁdām̐kā nī sarasālu yiṁta galadā
kaṁduva nalabu dīram̐ garuṇiṁcharādā

(||ĕṁdām̐kā||)
sĕkkulĕllam̐ jĕmariṁchĕ seri nīvu navviṁcham̐gā
vŏkkamāḍe yiṁtaide vobunā sĕli
kakkasiṁche vĕṁta nīvu kaṭhinasittum̐ḍavo
nikki māgaidem̐ jūsi nīrāya manasu

(||ĕṁdām̐kā||)
āragiṁcha nĕram̐gadu aṭṭĕ kadalu sĕppam̐gā-
nīrīdi dinamunaide yiṁti vobunā
dūrinā mānavu yĕṁta dosānagu vĕravavo
sārĕ māgaidem̐ jūsi jaḍisīni danuvu

(||ĕṁdām̐kā||)
kaḍudappi gŏnĕ nidĕ kāgim̐ṭa nīvu gūḍam̐ga
kaḍagi pāyabusadi kām̐ka kobunā
aḍari śhrīveṁkaḍeśha āḍigĕ kĕṁtobuduvo
baḍinunna māgaidem̐ bachchi dom̐sĕm̐banulu