Emdaamkaa navvulu navve veebedonu

ఎందాఁకా నవ్వులు నవ్వే వీపెతోను
Language

(॥పల్లవి॥)
ఎందాఁకా నవ్వులు నవ్వే వీపెతోను
ఇందరిలోనాఁ జనవులియ్యవయ్య ఇపుడు

(॥ఎందా॥)
ముంచక మునుకలాయ మొదల నీపైవలపు
పెంచకే పెద్దలాయను పెనుచన్నులు
మంచినీటిచెలమాయ మరియును తేనెమోవి
నించరాదా నీకరుణ నెలఁతపై నిఁకను

(॥ఎందా॥)
కూడఁగూడఁ గుప్పలాయ కొప్పులోని కీనెరులు
వాడనిచిగురువలె వచ్చె వయసు
వూడుచరానితగులై వున్నది నీనేస్తము
వేడుకఁ గూడఁగరాదా వెలఁది నింతటను

(॥ఎందా॥)
చెప్పఁజెప్పఁ గొత్తలాయ చెంతనే సింగారము
అప్పటి పెండ్లిచవికాయఁ గాఁగిలి
చిప్పిల నేలుకొంటివి శ్రీవేంకటేశ్వర
మెప్పించరాదా యలమేల్‌మంగను రతుల

(||pallavi||)
ĕṁdām̐kā navvulu navve vībĕdonu
iṁdarilonām̐ janavuliyyavayya ibuḍu

(||ĕṁdā||)
muṁchaga munugalāya mŏdala nībaivalabu
pĕṁchage pĕddalāyanu pĕnusannulu
maṁchinīḍisĕlamāya mariyunu tenĕmovi
niṁcharādā nīgaruṇa nĕlam̐tabai nim̐kanu

(||ĕṁdā||)
kūḍam̐gūḍam̐ guppalāya kŏppuloni kīnĕrulu
vāḍanisiguruvalĕ vachchĕ vayasu
vūḍusarānidagulai vunnadi nīnestamu
veḍugam̐ gūḍam̐garādā vĕlam̐di niṁtaḍanu

(||ĕṁdā||)
sĕppam̐jĕppam̐ gŏttalāya sĕṁtane siṁgāramu
appaḍi pĕṁḍlisavigāyam̐ gām̐gili
sippila nelugŏṁṭivi śhrīveṁkaḍeśhvara
mĕppiṁcharādā yalamel‌maṁganu radula