Emdaamkaa nalugalu yemtigi neegu

ఎందాఁకా నలుకలు యేఁటికి నీకు
Language

(॥పల్లవి॥)
ఎందాఁకా నలుకలు యేఁటికి నీకు
మందలించి యాతనితో మాటలాడరాదా

(॥ఎందాఁ॥)
వేడుకగలవారికి వేసారుకోఁదగునా
జోడైనవారి కెచ్చుకుందులేలా
మేడెపురతివారి మేకు లింత వలెనా
చూడవే యాతనిదిక్కు సొల సిఁక నై నాను

(॥ఎందాఁ॥)
సమ్మతులైన వారికి చలములు దగునా
చిమ్ముఁజాపులవారికి సిగ్గులేలా
దొమ్మివలపువారికి యెమ్మె లింత వలెనా
రమ్మని పిలువవే రమణుని నండకు

(॥ఎందాఁ॥)
నవ్వునవ్వేవారికి నాయములు దగునా
రవ్వలైనవారికి బీరములేలా
యివ్వల శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
నివ్వటిల్ల మెచ్చవే నేరుపుల నీతని

(||pallavi||)
ĕṁdām̐kā nalugalu yem̐ṭigi nīgu
maṁdaliṁchi yādanido māḍalāḍarādā

(||ĕṁdām̐||)
veḍugagalavārigi vesārugom̐dagunā
joḍainavāri kĕchchuguṁdulelā
meḍĕburadivāri megu liṁta valĕnā
sūḍave yādanidikku sŏla sim̐ka nai nānu

(||ĕṁdām̐||)
sammadulaina vārigi salamulu dagunā
simmum̐jābulavārigi siggulelā
dŏmmivalabuvārigi yĕmmĕ liṁta valĕnā
rammani piluvave ramaṇuni naṁḍagu

(||ĕṁdām̐||)
navvunavvevārigi nāyamulu dagunā
ravvalainavārigi bīramulelā
yivvala śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐ gūḍĕ
nivvaḍilla mĕchchave nerubula nīdani