Emdaamkaa nalugalu yemtige neegu

ఎందాఁకా నలుకలు యేఁటికే నీకు
Language

(॥పల్లవి॥)
ఎందాఁకా నలుకలు యేఁటికే నీకు
విందువలె నిఁక నిన్నీ వేడుకలే కాక

(॥ఎందాఁ॥)
తగులు మనసులోన తగిలినవారైతే
మొగము చూడకుందురా ముచ్చటకైనా
అగపడి నీవాతని ఆనలేల పెట్టేవే
నగకుండవచ్చునా ననిచి నీతోను

(॥ఎందాఁ॥)
పోరాని చుట్టరికము పొసగినవారైతే
గారవించి యెంతైనా దగ్గరకుందురా
ధీరత నంటకుమని తిట్లేల తిట్టేవే
కూరిమిసేయకుండునా కూడేటినీతోను

(॥ఎందాఁ॥)
సమ్మతించినమోహము చనవుగల వారైతే
కమ్ముకొనకుందురా కాఁగిట నిట్టే
యిమ్ముల శ్రీవేంకటేశుఁ డిట్టె నిన్నుఁ గూడె
బొమ్మజంకెలే లితఁడు పొసఁగె నీతోను

(||pallavi||)
ĕṁdām̐kā nalugalu yem̐ṭige nīgu
viṁduvalĕ nim̐ka ninnī veḍugale kāga

(||ĕṁdām̐||)
tagulu manasulona tagilinavāraide
mŏgamu sūḍaguṁdurā muchchaḍagainā
agabaḍi nīvādani ānalela pĕṭṭeve
nagaguṁḍavachchunā nanisi nīdonu

(||ĕṁdām̐||)
porāni suṭṭarigamu pŏsaginavāraide
gāraviṁchi yĕṁtainā daggaraguṁdurā
dhīrada naṁṭagumani tiṭlela tiṭṭeve
kūrimiseyaguṁḍunā kūḍeḍinīdonu

(||ĕṁdām̐||)
sammadiṁchinamohamu sanavugala vāraide
kammugŏnaguṁdurā kām̐giḍa niṭṭe
yimmula śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ ninnum̐ gūḍĕ
bŏmmajaṁkĕle lidam̐ḍu pŏsam̐gĕ nīdonu