ఎందాఁకా నా మనవులు యేమి చెప్పేను
(॥పల్లవి॥)
ఎందాఁకా నా మనవులు యేమి చెప్పేను
చెంది తానే నా సేవలు చిత్తగించు మనవే
(॥ఎందాఁ॥)
సేసలకు త నెదుట శిరసొగ్గితి నప్పుడే
ఆసలకు లోనైతి నారడిగాను
వాసులకుఁ బెనగితి వడి సవతులలోను
రాసికెక్కె నా వలపు రమ్మననే పతిని
(॥ఎందాఁ॥)
వేడుకకుఁ దనతోను వెలయఁగ నవ్వితి
వాడికకు మేడలోన వచ్చి వుందాన
ఆడికకుఁ బాలైతి నందరిముందరా నేను
యీడ నన్ను మన్నించి యీడేరించు మనవే
(॥ఎందాఁ॥)
విందులకు మోవి తేనె వేమారుఁ జూపితి
పొందులకు మఁటలాడి పొదిగితిని
ఇందులకే శ్రీవేంకటేశుఁడు వచ్చి నన్నేలె
కందువ నిట్టే నన్నుఁ గరుణించు మనవే
(||pallavi||)
ĕṁdām̐kā nā manavulu yemi sĕppenu
sĕṁdi tāne nā sevalu sittagiṁchu manave
(||ĕṁdām̐||)
sesalagu ta nĕduḍa śhirasŏggidi nappuḍe
āsalagu lonaidi nāraḍigānu
vāsulagum̐ bĕnagidi vaḍi savadulalonu
rāsigĕkkĕ nā valabu rammanane padini
(||ĕṁdām̐||)
veḍugagum̐ danadonu vĕlayam̐ga navvidi
vāḍigagu meḍalona vachchi vuṁdāna
āḍigagum̐ bālaidi naṁdarimuṁdarā nenu
yīḍa nannu manniṁchi yīḍeriṁchu manave
(||ĕṁdām̐||)
viṁdulagu movi tenĕ vemārum̐ jūbidi
pŏṁdulagu mam̐ṭalāḍi pŏdigidini
iṁdulage śhrīveṁkaḍeśhum̐ḍu vachchi nannelĕ
kaṁduva niṭṭe nannum̐ garuṇiṁchu manave