ఎందాఁకా మనసుచూచే వేమిజోలిఁబెట్టేవు
(॥పల్లవి॥)
ఎందాఁకా మనసుచూచే వేమిజోలిఁబెట్టేవు
అంది కాఁగిలించుకొని యాదరించవయ్యా
(॥ఎందాఁ॥)
చెప్పరానిప్రియుములు చెప్పిచెప్పి నీకును
కప్పురము గానుకిచ్చెఁ గలికి
కొప్పుజార మొక్కుమొక్కి కూరిమి గొసరీ నిన్ను
తప్పక యిఁకనైనాను దయదలఁచవయ్యా
(॥ఎందాఁ॥)
సేయరానివినయాలు చేసిచేసి యప్పటికిని
పూయిమని గందమిచ్చె బొలఁతి
చేయిమీఁదుగా నిన్నుఁ జెక్కునొక్కి వేఁడుకొని
పాయరానిచనవిచ్చి పాలించవయ్యా
(॥ఎందాఁ॥)
ఆడరానిమంతనము లాడియాడి నీముందర
వీడెము చేతికిచ్చె వెలఁది
యీడుజొడై శ్రీవేంకటేశ ఇప్పు డేలితివి
వేడుకలెల్లాఁ జేసి వెలయించవయ్యా
(||pallavi||)
ĕṁdām̐kā manasusūse vemijolim̐bĕṭṭevu
aṁdi kām̐giliṁchugŏni yādariṁchavayyā
(||ĕṁdām̐||)
sĕpparānipriyumulu sĕppisĕppi nīgunu
kappuramu gānugichchĕm̐ galigi
kŏppujāra mŏkkumŏkki kūrimi gŏsarī ninnu
tappaga yim̐kanainānu dayadalam̐savayyā
(||ĕṁdām̐||)
seyarānivinayālu sesisesi yappaḍigini
pūyimani gaṁdamichchĕ bŏlam̐ti
seyimīm̐dugā ninnum̐ jĕkkunŏkki vem̐ḍugŏni
pāyarānisanavichchi pāliṁchavayyā
(||ĕṁdām̐||)
āḍarānimaṁtanamu lāḍiyāḍi nīmuṁdara
vīḍĕmu sedigichchĕ vĕlam̐di
yīḍujŏḍai śhrīveṁkaḍeśha ippu ḍelidivi
veḍugalĕllām̐ jesi vĕlayiṁchavayyā