Emdaamkaa mamkumdanamemtigi neegu

ఎందాఁకా మంకుఁదనమేఁటికి నీకు
Language

(॥పల్లవి॥)
ఎందాఁకా మంకుఁదనమేఁటికి నీకు
చందముగా మన్నించి చనవియ్యరాదా

(॥ఎందా॥)
హత్తి నిన్ను వేఁడుకొనీ నప్పటనుండియుఁ బతి
చిత్తములోపలిమాట చెప్పరాదా
కొత్త కొత్తవలపుల కొంగువట్టి నిన్నుఁదీసి
పొత్తులఁగూచుండి అట్టే పొసఁగఁగరాదా

(॥ఎందా॥)
పెనఁగుచు మాఁటలాడి ప్రియములు చెప్పీని
వినయములెల్లా నీవు వినరాదా
తనివి దీరక పైపైఁ దానే సరసములాడి
చెనకుచు నీవు నట్టే చెలఁగరాదా

(॥ఎందా॥)
కప్పురము నోరికిచ్చి కాఁగిలించుకొనీ నిన్ను
యిప్పుడు నీవియ్యకొని యెనయరాదా
అప్పటి శ్రీవేంకటేశుఁడంగవించి నిన్నుఁగూడె
దప్పిదేరి యన్నిటాను తనివందరాదా

(||pallavi||)
ĕṁdām̐kā maṁkum̐danamem̐ṭigi nīgu
saṁdamugā manniṁchi sanaviyyarādā

(||ĕṁdā||)
hatti ninnu vem̐ḍugŏnī nappaḍanuṁḍiyum̐ badi
sittamulobalimāḍa sĕpparādā
kŏtta kŏttavalabula kŏṁguvaṭṭi ninnum̐dīsi
pŏttulam̐gūsuṁḍi aṭṭe pŏsam̐gam̐garādā

(||ĕṁdā||)
pĕnam̐gusu mām̐ṭalāḍi priyamulu sĕppīni
vinayamulĕllā nīvu vinarādā
tanivi dīraga paibaim̐ dāne sarasamulāḍi
sĕnagusu nīvu naṭṭe sĕlam̐garādā

(||ĕṁdā||)
kappuramu norigichchi kām̐giliṁchugŏnī ninnu
yippuḍu nīviyyagŏni yĕnayarādā
appaḍi śhrīveṁkaḍeśhum̐ḍaṁgaviṁchi ninnum̐gūḍĕ
dappideri yanniḍānu tanivaṁdarādā