ఎందాఁకా మాటలు నీతో నేమి చెప్పేము
(॥పల్లవి॥)
ఎందాఁకా మాటలు నీతో నేమి చెప్పేము
నింద వేసి నీమాట నీకు నొప్పగించెను
(॥ఎందా॥)
యిందె నీకుఁ జెప్పి పంపి మోహము నీమీఁద వేసి
కందువ నిట్టె చెలి కాచుకున్నది
ఇందరితో నీ సుద్దులే యేపొద్దూ నుడుగుకొంటా
సందడిఁ గాల మిట్లా జరపఁ జొచ్చెను
(॥ఎందా॥)
నిద్దుర గంటఁ బెట్టుక నీకె సెలవుగాను
పొద్దు వొద్దు జాగరాలఁ బొంచి వున్నది
కొద్దిమీరినట్టి మీగుణాలే తలఁచుకొంటా
గద్దరినివ్వెరగులఁ గరఁగఁగ జొచ్చెను
(॥ఎందా॥)
మనసు నీకు మీఁదెత్తి మంతనములే మరిఁగి
చనవు సేసుక నీతో జంట నున్నది
యెనసితి నీచెలిని ఇంతలో శ్రీ వేంకటేశ
ననువున నీతోడి నవ్వులకుఁ జొచ్చెను
(||pallavi||)
ĕṁdām̐kā māḍalu nīdo nemi sĕppemu
niṁda vesi nīmāḍa nīgu nŏppagiṁchĕnu
(||ĕṁdā||)
yiṁdĕ nīgum̐ jĕppi paṁpi mohamu nīmīm̐da vesi
kaṁduva niṭṭĕ sĕli kāsugunnadi
iṁdarido nī suddule yebŏddū nuḍugugŏṁṭā
saṁdaḍim̐ gāla miṭlā jarabam̐ jŏchchĕnu
(||ĕṁdā||)
niddura gaṁṭam̐ bĕṭṭuga nīgĕ sĕlavugānu
pŏddu vŏddu jāgarālam̐ bŏṁchi vunnadi
kŏddimīrinaṭṭi mīguṇāle talam̐sugŏṁṭā
gaddarinivvĕragulam̐ garam̐gam̐ga jŏchchĕnu
(||ĕṁdā||)
manasu nīgu mīm̐dĕtti maṁtanamule marim̐gi
sanavu sesuga nīdo jaṁṭa nunnadi
yĕnasidi nīsĕlini iṁtalo śhrī veṁkaḍeśha
nanuvuna nīdoḍi navvulagum̐ jŏchchĕnu