Emdaamkaa joojaalaadeveme neevu

ఎందాఁకా జూజాలాడేవేమే నీవు
Language

(॥పల్లవి॥)
ఎందాఁకా జూజాలాడేవేమే నీవు
అందంది నీతోడి పొందు లాసగించు నితఁడు

(॥ఎందాఁ॥)
చక్కని నీమోము చూపి సరసము లాడవే
నిక్కి నిక్కి చూచీని నీరమణుఁడు
చెక్కు కొనగోర నొక్కి చిరునవ్వు నవ్వవే
మిక్కిలి నీతోఁ గడుమేలుగలఁ డితఁడు

(॥ఎందాఁ॥)
సరుసనే కూచుండి చనుఁగవ నొత్తవే
విరులబంతుల వేసీ విభుఁడు నిన్ను
సరుగ మోవి యొసఁగి చవులు మరపవే
మరగ నేపొద్దూ నీపై బత్తిసేను నితఁడు

(॥ఎందాఁ॥)
జోడుగాఁ గాఁగిట నించి సొంపులెల్లా రేఁచవే
వేడుకతో నున్నాడు శ్రీ వేంకటేశుఁడు
యీడైన రతులఁ గూడె యిచ్చకమే సేయవే
వాడికమకముల వలచు నీ కితఁడు

(||pallavi||)
ĕṁdām̐kā jūjālāḍeveme nīvu
aṁdaṁdi nīdoḍi pŏṁdu lāsagiṁchu nidam̐ḍu

(||ĕṁdām̐||)
sakkani nīmomu sūbi sarasamu lāḍave
nikki nikki sūsīni nīramaṇum̐ḍu
sĕkku kŏnagora nŏkki sirunavvu navvave
mikkili nīdom̐ gaḍumelugalam̐ ḍidam̐ḍu

(||ĕṁdām̐||)
sarusane kūsuṁḍi sanum̐gava nŏttave
virulabaṁtula vesī vibhum̐ḍu ninnu
saruga movi yŏsam̐gi savulu marabave
maraga nebŏddū nībai battisenu nidam̐ḍu

(||ĕṁdām̐||)
joḍugām̐ gām̐giḍa niṁchi sŏṁpulĕllā rem̐save
veḍugado nunnāḍu śhrī veṁkaḍeśhum̐ḍu
yīḍaina radulam̐ gūḍĕ yichchagame seyave
vāḍigamagamula valasu nī kidam̐ḍu