ఎందాఁకా జూజాలాడే వింతులతోను
(॥పల్లవి॥)
ఎందాఁకా జూజాలాడే వింతులతోను
పొందెరిఁగి యీపెనిట్టె బుజ్జగించవలదా
(॥ఎందాఁ॥)
సొలసి చెలియ నిన్నుఁ జాచి చూచి వేసారె
వెలినుండి విరులను వేసి వేసారె
పలుమారు నీపదాలు పాడిపాడి వేసారె
కలికిఁ దలెత్తి చూచి కరుణించవలదా
(॥ఎందాఁ॥)
నవ్వుచు నీ యెదుట సన్నలు సేసి వేసారె
వువ్విళ్ళూరఁ గొనగోర నూఁది వేసారె
చివ్వనఁ బన్నీరు నీపైఁ జిమ్మి చిమ్మి వేసారె
జవ్వనితో మాఁటలాడి చనవియ్యవలదా
(॥ఎందాఁ॥)
సంగడి వచ్చి కూచుండి చన్నుల నొత్తి వేసారె
చెంగటఁ దొడపై తొడచేర్చి వేసారె
యింగితము శ్రీవేంకటేశ యెరిఁగి వచ్చి
అంగనఁ గూడితి వింకా నప్పుటి రావలదా
(||pallavi||)
ĕṁdām̐kā jūjālāḍe viṁtuladonu
pŏṁdĕrim̐gi yībĕniṭṭĕ bujjagiṁchavaladā
(||ĕṁdām̐||)
sŏlasi sĕliya ninnum̐ jāsi sūsi vesārĕ
vĕlinuṁḍi virulanu vesi vesārĕ
palumāru nībadālu pāḍibāḍi vesārĕ
kaligim̐ dalĕtti sūsi karuṇiṁchavaladā
(||ĕṁdām̐||)
navvusu nī yĕduḍa sannalu sesi vesārĕ
vuvviḽḽūram̐ gŏnagora nūm̐di vesārĕ
sivvanam̐ bannīru nībaim̐ jimmi simmi vesārĕ
javvanido mām̐ṭalāḍi sanaviyyavaladā
(||ĕṁdām̐||)
saṁgaḍi vachchi kūsuṁḍi sannula nŏtti vesārĕ
sĕṁgaḍam̐ dŏḍabai tŏḍasersi vesārĕ
yiṁgidamu śhrīveṁkaḍeśha yĕrim̐gi vachchi
aṁganam̐ gūḍidi viṁkā nappuḍi rāvaladā