ఎందాఁకా జలమింక నియ్యకోవయ్య
(॥పల్లవి॥)
ఎందాఁకా జలమింక నియ్యకోవయ్య
కందువ నీ చెప్పినట్టె కానీవయ్యా
(॥ఎందాఁ॥)
కోపగించఁగలందుకుఁ గోపగించితిమి మీతో
నాపనికి నింక నీతో నవ్వేనయ్య
తీపుల నీటేఁతలకుఁ దెగి పంతాలే యాడితి
మోపిచూసి ఇఁక నీకు మొక్కేనయ్యా
(॥ఎందాఁ॥)
అట్టె నీవు రానందుకు నవ్వలి మోమైతి నింతే
యెట్టు విలిచిన వచ్చే నిదిగో వయ్యా
చుట్టపువరుసలెల్లఁ జూచిచూచి సొలసితి
జట్టి నీవేమి సేసినాసమ్మతించేనయ్యా
(॥ఎందాఁ॥)
అప్ప టావేగిరమున ఆన వెట్టుకొంటి నేను
యిప్పుడు లేదనవయ్య యేమయ్యా
వొప్పుగ శ్రీ వేంకటేశ వొనగూడి కతులను
మెప్పించఁగ నే నిన్ను మెచ్చితినయ్యా
(||pallavi||)
ĕṁdām̐kā jalamiṁka niyyagovayya
kaṁduva nī sĕppinaṭṭĕ kānīvayyā
(||ĕṁdām̐||)
kobagiṁcham̐galaṁdugum̐ gobagiṁchidimi mīdo
nābanigi niṁka nīdo navvenayya
tībula nīḍem̐talagum̐ dĕgi paṁtāle yāḍidi
mobisūsi im̐ka nīgu mŏkkenayyā
(||ĕṁdām̐||)
aṭṭĕ nīvu rānaṁdugu navvali momaidi niṁte
yĕṭṭu vilisina vachche nidigo vayyā
suṭṭabuvarusalĕllam̐ jūsisūsi sŏlasidi
jaṭṭi nīvemi sesināsammadiṁchenayyā
(||ĕṁdām̐||)
appa ṭāvegiramuna āna vĕṭṭugŏṁṭi nenu
yippuḍu ledanavayya yemayyā
vŏppuga śhrī veṁkaḍeśha vŏnagūḍi kadulanu
mĕppiṁcham̐ga ne ninnu mĕchchidinayyā