Emdaamkaa bujjagimche vemayyaa

ఎందాఁకా బుజ్జగించే వేమయ్యా
Language

(॥పల్లవి॥)
ఎందాఁకా బుజ్జగించే వేమయ్యా
మందెమేళమయ్యీ మరి నే మొక్కేనయ్యా

(॥॥)
యీడు వెట్టుకొని నన్ను యెంతవొడఁబరచేవు
వేడుకతో నీమాటలు వింటినయ్యా
నీడకుఁ దీసి నమ్న నిమిరేవు నాచెక్కులు
తోడనే యిందుకు నే సంతోసించుకొంటినయ్యా

(॥॥)
సరుస నన్నుఁ బెట్టుక చన్ను లెంతపుడికేవు
గరిమ నీమన్ననలు గై కొంటినయ్యా
విరులు ముడిచి నన్ను వెస నెంతలాలించేవు
సరవులన్నిటా నాకు సమ్మతాయనయ్యా

(॥॥)
చనవిచ్చి నన్ను నెంత సారెకు గాఁగిలించేవు
నినుపురతులను తనిసితినయ్యా
యెనసితివి శ్రీవేంకటేశ యల మేల్మంగను
మనసున నీపొందులు మరిగితినయ్యా

(||pallavi||)
ĕṁdām̐kā bujjagiṁche vemayyā
maṁdĕmeḽamayyī mari ne mŏkkenayyā

(||||)
yīḍu vĕṭṭugŏni nannu yĕṁtavŏḍam̐barasevu
veḍugado nīmāḍalu viṁṭinayyā
nīḍagum̐ dīsi namna nimirevu nāsĕkkulu
toḍane yiṁdugu ne saṁtosiṁchugŏṁṭinayyā

(||||)
sarusa nannum̐ bĕṭṭuga sannu lĕṁtabuḍigevu
garima nīmannanalu gai kŏṁṭinayyā
virulu muḍisi nannu vĕsa nĕṁtalāliṁchevu
saravulanniḍā nāgu sammadāyanayyā

(||||)
sanavichchi nannu nĕṁta sārĕgu gām̐giliṁchevu
ninuburadulanu tanisidinayyā
yĕnasidivi śhrīveṁkaḍeśha yala melmaṁganu
manasuna nībŏṁdulu marigidinayyā