ఎందాఁక నీ సిగ్గు లేఁటికిఁ బెంచేవు
(॥పల్లవి॥)
ఎందాఁక నీ సిగ్గు లేఁటికిఁ బెంచేవు
పొందులు దొరకెను భోగించ రాదా
(॥ఎందాక॥)
చెలఁగి నీకురులు చేతుల దువ్వుచు
మలసెటిపతితో మా టాడవే
సెలవినవ్వుతోఁ జెక్కులు నొక్కి
చెలువుని చనవులు చెల్లించ రాదా
(॥ఎందాక॥)
కదిసి చేసురటి కాంతుఁడు విసరీ
నదె చీచేతుల నందుకోవే
మొదల నాతఁడె ముచ్చట లాడీ
యెదు రుత్తరము నీ వియ్యఁగ రాదా
(॥ఎందాక॥)
ఆతఁడు కాఁగిట నట్టె బిగించీ
నీతగ విప్పుడు నెరపఁ గదే
కాతరపు శ్రీవెంకటఘనుఁ డితఁడు
ఘాతలఁ గూడెను కనుఁగొన రాదా
(||pallavi||)
ĕṁdām̐ka nī siggu lem̐ṭigim̐ bĕṁchevu
pŏṁdulu dŏragĕnu bhogiṁcha rādā
(||ĕṁdāga||)
sĕlam̐gi nīgurulu sedula duvvusu
malasĕḍibadido mā ṭāḍave
sĕlavinavvudom̐ jĕkkulu nŏkki
sĕluvuni sanavulu sĕlliṁcha rādā
(||ĕṁdāga||)
kadisi sesuraḍi kāṁtum̐ḍu visarī
nadĕ sīsedula naṁdugove
mŏdala nādam̐ḍĕ muchchaḍa lāḍī
yĕdu ruttaramu nī viyyam̐ga rādā
(||ĕṁdāga||)
ādam̐ḍu kām̐giḍa naṭṭĕ bigiṁchī
nīdaga vippuḍu nĕrabam̐ gade
kādarabu śhrīvĕṁkaḍaghanum̐ ḍidam̐ḍu
ghādalam̐ gūḍĕnu kanum̐gŏna rādā