ఎందాకా మనసు చూచే వింతిని నీవు
(॥పల్లవి॥)
ఎందాకా మనసు చూచే వింతిని నీవు
పొందులనే కానరాదా భోగములు
(॥ఎందాఁ॥)
మొగము దప్పకచూచి మోహము నీతోఁ జెప్పీ
నగినందే కానరాదా నాతియాసలు
చిగురుమోవి ఇచ్చి చేతులుచాఁచీ నీకు
తగులఁగా గానరాదా తమకములు
(॥ఎందాఁ॥)
నిలువుఁగొలువు వేసి నేరుపులు వచరించీ
పిలువఁగఁ గానరాదా ప్రేమములు
మొలకచన్నులు చూసి ముద్దులమాట లాడీ
తలఁచితేఁ గానరాదా నిలుకడలు
(॥ఎందాఁ॥)
కదిసి కూచుండి యట్టె కాఁగిటను బిగియించీ
వుదుట్లఁ గానరాదా వొడఁబాటు
అదన శ్రీవేంకటేశ అంగన నేలితి విట్టె
యెదుటనే కానరాదా ఇచ్చకములు
(||pallavi||)
ĕṁdāgā manasu sūse viṁtini nīvu
pŏṁdulane kānarādā bhogamulu
(||ĕṁdām̐||)
mŏgamu dappagasūsi mohamu nīdom̐ jĕppī
naginaṁde kānarādā nādiyāsalu
sigurumovi ichchi sedulusām̐sī nīgu
tagulam̐gā gānarādā tamagamulu
(||ĕṁdām̐||)
niluvum̐gŏluvu vesi nerubulu vasariṁchī
piluvam̐gam̐ gānarādā premamulu
mŏlagasannulu sūsi muddulamāḍa lāḍī
talam̐sidem̐ gānarādā nilugaḍalu
(||ĕṁdām̐||)
kadisi kūsuṁḍi yaṭṭĕ kām̐giḍanu bigiyiṁchī
vuduṭlam̐ gānarādā vŏḍam̐bāḍu
adana śhrīveṁkaḍeśha aṁgana nelidi viṭṭĕ
yĕduḍane kānarādā ichchagamulu