Emda rainam galaru nee kerumgudu nadi nenu

ఎంద రైనఁ గలరు నీ కెరుఁగుదు నది నేను
Language

(॥పల్లవి॥)
ఎంద రైనఁ గలరు నీ కెరుఁగుదు నది నేను
నింద నీపైఁ బడీనని నే ననేఁ గాని

(॥ఎందరైన॥)
కాయము నీచేతిది కడు మోహించితిఁ గాన
యేయడకు నీ వేఁగఁగా నే మౌదునో
నాయంతకు నే వెరవ నంటున నిన్నందరును
యీయెడ దూరే రని యెంచుకొనేఁగాని

(॥ఎందరైన॥)
వుసు రెల్ల నీసొమ్ము వూడిగపుదానఁ గాన
దెసలు నీచేతవి నీ తెగు వెట్టౌనో
విసుగ నీసుద్దులకు వెక్కసపుటపకీర్తి
ముసరి మీఁదట నీపై మోచీ ననీ కాని

(॥ఎందరైన॥)
బదు కెల్ల నీసొమ్ము పట్టపుదేవులఁ గాన
యిదె నీరతులలో నే నెంత సేతునో
పొదిగి శ్రీవెంకటేశ పోనీక కూడితి నన్ను
అది గాదు నాతో సరి యయితి వనీ కాని

(||pallavi||)
ĕṁda rainam̐ galaru nī kĕrum̐gudu nadi nenu
niṁda nībaim̐ baḍīnani ne nanem̐ gāni

(||ĕṁdaraina||)
kāyamu nīsedidi kaḍu mohiṁchidim̐ gāna
yeyaḍagu nī vem̐gam̐gā ne mauduno
nāyaṁtagu ne vĕrava naṁṭuna ninnaṁdarunu
yīyĕḍa dūre rani yĕṁchugŏnem̐gāni

(||ĕṁdaraina||)
vusu rĕlla nīsŏmmu vūḍigabudānam̐ gāna
dĕsalu nīsedavi nī tĕgu vĕṭṭauno
visuga nīsuddulagu vĕkkasabuḍabagīrdi
musari mīm̐daḍa nībai mosī nanī kāni

(||ĕṁdaraina||)
badu kĕlla nīsŏmmu paṭṭabudevulam̐ gāna
yidĕ nīradulalo ne nĕṁta seduno
pŏdigi śhrīvĕṁkaḍeśha ponīga kūḍidi nannu
adi gādu nādo sari yayidi vanī kāni