Emchide nogadi koga tekkudaaya simgaaramu

ఎంచితే నొకటి కొక టెక్కుడాయ సింగారము
Language

(॥పల్లవి॥)
ఎంచితే నొకటి కొక టెక్కుడాయ సింగారము
మించిన యీపె వొరపు మిక్కిలి సింగారము

(॥ఎంచి॥)
చెలివదనమునకు చిరునవ్వు సింగారము
పలువరుసకు ముద్దుఁబలుకు సింగారము
కలికి కన్నులకు చింక చూపులు సింగారము
నిలువు దారుమునకు నెరులు సింగారము

(॥ఎంచి॥)
గరిమ మొగమునకు కళలు సింగారము
వురమునకు చన్నుల వుద్దుటు సింగారము
సరుస బొమ్మలకును జంకెనలు సింగారము
సిరి దొలఁకు మేనికి సిగ్గులు సింగారము

(॥ఎంచి॥)
పెనుఁ బిరుఁదుకు మురిపెములు సింగారము
వొనరిన వేతులకు వొయ్యారాలు సింగారము
ననిచి శ్రీవేంకటేశునకు నీకు దేవులాయ
పెనగొన్నరతు లివి పెండ్లి సింగారము

(||pallavi||)
ĕṁchide nŏgaḍi kŏga ṭĕkkuḍāya siṁgāramu
miṁchina yībĕ vŏrabu mikkili siṁgāramu

(||ĕṁchi||)
sĕlivadanamunagu sirunavvu siṁgāramu
paluvarusagu muddum̐balugu siṁgāramu
kaligi kannulagu siṁka sūbulu siṁgāramu
niluvu dārumunagu nĕrulu siṁgāramu

(||ĕṁchi||)
garima mŏgamunagu kaḽalu siṁgāramu
vuramunagu sannula vudduḍu siṁgāramu
sarusa bŏmmalagunu jaṁkĕnalu siṁgāramu
siri dŏlam̐ku menigi siggulu siṁgāramu

(||ĕṁchi||)
pĕnum̐ birum̐dugu muribĕmulu siṁgāramu
vŏnarina vedulagu vŏyyārālu siṁgāramu
nanisi śhrīveṁkaḍeśhunagu nīgu devulāya
pĕnagŏnnaradu livi pĕṁḍli siṁgāramu