Emchide naavalla neegu nemunnadi

ఎంచితే నావల్ల నీకు నేమున్నది
Language

(॥పల్లవి॥)
ఎంచితే నావల్ల నీకు నేమున్నది
మించి నేనే జాణనంటా మెచ్చేవుగాక

(॥ఎంచి॥)
మొక్కలాన నే నీతో మోమువంచు కుండఁగాను
చెక్కునొక్కి మోమెత్తి చిత్తగించితి
ఇక్కువ నింతమన్నించ నేమి బాఁతి నే నీకు
నిక్కి నీమంచితనమే నిరుపేవు గాక

(॥ఎంచి॥)
పంతములు నేనీతో పచరించుకుండఁగాను
చింతదీర నవ్వు నవ్వి చేయివట్టితి
చెంత నన్నుఁ బొది గింతసేయ నేమిపని నీకు
కాంతలెడ నీ పుణ్యము గట్టుకొంటిఁగాక

(॥ఎంచి॥)
ముందు వెనకెంచి నీతో మొన వెట్టుకుండఁ గాను
అంది నన్నుఁ గాఁగిలించి యాదరించితి
కందువ శ్రీ వేంకటేశ కారణమేమి నీకు
సంగడి యేలే నీకు సాజమేమో కాక

(||pallavi||)
ĕṁchide nāvalla nīgu nemunnadi
miṁchi nene jāṇanaṁṭā mĕchchevugāga

(||ĕṁchi||)
mŏkkalāna ne nīdo momuvaṁchu kuṁḍam̐gānu
sĕkkunŏkki momĕtti sittagiṁchidi
ikkuva niṁtamanniṁcha nemi bām̐ti ne nīgu
nikki nīmaṁchidaname nirubevu gāga

(||ĕṁchi||)
paṁtamulu nenīdo pasariṁchuguṁḍam̐gānu
siṁtadīra navvu navvi seyivaṭṭidi
sĕṁta nannum̐ bŏdi giṁtaseya nemibani nīgu
kāṁtalĕḍa nī puṇyamu gaṭṭugŏṁṭim̐gāga

(||ĕṁchi||)
muṁdu vĕnagĕṁchi nīdo mŏna vĕṭṭuguṁḍam̐ gānu
aṁdi nannum̐ gām̐giliṁchi yādariṁchidi
kaṁduva śhrī veṁkaḍeśha kāraṇamemi nīgu
saṁgaḍi yele nīgu sājamemo kāga