Emchi sooside neegee innibhaagyaalum galavu

ఎంచి చూచితే నీకీ ‌ఇన్నిభాగ్యాలుఁ గలవు
Language

(॥పల్లవి॥)
ఎంచి చూచితే నీకీ ‌ఇన్నిభాగ్యాలుఁ గలవు
పొంచిచూడ వేడుకలు పొంకపు నీ కతలు

(॥ఎంచి॥)
మక్కువగలుగువారు మంచిమాట లాడితేను
చక్కెరకంటెఁ దీపులై చవివుట్టును
చోక్కపుఁ జూపుతను సోలసి చూచితేను
అక్కజముగా గందమ్మలందినచందము

(॥ఎంచి॥)
ననుపుగలుగువారు నవ్వులు నవ్వితేను
పెనఁగి ముత్తేలసేస పెట్టినట్లుండును
చనవున నంతలోనే చనుఁగవ నొత్తితేను
కనకపురాసులు గలిగినయట్లు

(॥ఎంచి॥)
చుట్టరికమైనవారు సోగయఁ గాఁగిలించితే
ఇట్టే రాజ్యమేలినంతఇంపు గలుగు
నెట్టన శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
జట్టిగా నన్నేలితివి సంతోసమే యౌను

(||pallavi||)
ĕṁchi sūside nīgī ‌innibhāgyālum̐ galavu
pŏṁchisūḍa veḍugalu pŏṁkabu nī kadalu

(||ĕṁchi||)
makkuvagaluguvāru maṁchimāḍa lāḍidenu
sakkĕragaṁṭĕm̐ dībulai savivuṭṭunu
sokkabum̐ jūbudanu solasi sūsidenu
akkajamugā gaṁdammalaṁdinasaṁdamu

(||ĕṁchi||)
nanubugaluguvāru navvulu navvidenu
pĕnam̐gi muttelasesa pĕṭṭinaṭluṁḍunu
sanavuna naṁtalone sanum̐gava nŏttidenu
kanagaburāsulu galiginayaṭlu

(||ĕṁchi||)
suṭṭarigamainavāru sogayam̐ gām̐giliṁchide
iṭṭe rājyamelinaṁta̮iṁpu galugu
nĕṭṭana śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
jaṭṭigā nannelidivi saṁtosame yaunu