ఎంచి చూడుమా నీ కెంత యితవైనాను
(॥పల్లవి॥)
ఎంచి చూడుమా నీ కెంత యితవైనాను
వంచన మీరి నవ్వవచ్చునా వోయి
(॥ఎంచి॥)
పాయలేక నీవెంత పచ్చిగా మోహించినాను
చేయరానిసేఁతలు చేయవచ్చునా
అయెడ నీ కటువంటి వలవాటు గలిగితే
చాయల మా కింత సేయ సంగతులా వోఇ
(॥ఎంచి॥)
వేడుకతో నీవెఁత వెన నప్ప ణిచ్చినాను
ఆడరానిమాటలు నిన్నాడవచ్చునా
యీడనాడఁ దిరుగాది ఇవి నీకుఁ చవులైతే
పాడిదప్ప మాకివి పనులా వోయి
(॥ఎంచి॥)
ఇప్పుడే నీవు నెంత చన విచ్చినాను
చెప్పరానిపని నీకుఁ జెప్పవచ్చునా
నెప్పున శ్రీవేంకటేశ నీకు నేను బాఁతైతే
అప్పటి మా కలఇంచ నందమా నిన్నోయి
(||pallavi||)
ĕṁchi sūḍumā nī kĕṁta yidavainānu
vaṁchana mīri navvavachchunā voyi
(||ĕṁchi||)
pāyalega nīvĕṁta pachchigā mohiṁchinānu
seyarānisem̐talu seyavachchunā
ayĕḍa nī kaḍuvaṁṭi valavāḍu galigide
sāyala mā kiṁta seya saṁgadulā voi
(||ĕṁchi||)
veḍugado nīvĕm̐ta vĕna nappa ṇichchinānu
āḍarānimāḍalu ninnāḍavachchunā
yīḍanāḍam̐ dirugādi ivi nīgum̐ savulaide
pāḍidappa māgivi panulā voyi
(||ĕṁchi||)
ippuḍe nīvu nĕṁta sana vichchinānu
sĕpparānibani nīgum̐ jĕppavachchunā
nĕppuna śhrīveṁkaḍeśha nīgu nenu bām̐taide
appaḍi mā kala̮iṁcha naṁdamā ninnoyi