ఎంచి చూడవైతిగాక యింతి నీ కిన్నియుఁ గాదా
(॥పల్లవి॥)
ఎంచి చూడవైతిగాక యింతి నీ కిన్నియుఁ గాదా
మంచిదాయ యిఁకనైనా మఱవకువయ్యా
(॥ఎంచి॥)
పొంగేటి జలధి దచ్చి పుట్టించితి వమృతము
అంగనమోవినే కాదా అమృతము
చెంగి పోయి వైకుంఠాన శేషునిపై బండితివి
చెంగఁట నీచెలి యారు శేషుఁడే కాఁడా
(॥ఎంచి॥)
ఆకాసాన నొకడుగు అడిగితివి బలిని
ఆకసము చెలినడుమందునే కాదా
మేకొని వేదాలకుఁగా మీనవై పొడమితివి
కైకొని సతికన్నులే గండుమీలు గావా
(॥ఎంచి॥)
కోరి శ్రీవేంకటమనేకొండ యెక్కితివి నీవు
కూరిమి చెలికుచాలు కొండలే కావా
చేరి సర్వజీవులచిత్తములో నిలిచితి
తేరి యాకె నీ వురానఁ దిరమాయఁ గాదా
(||pallavi||)
ĕṁchi sūḍavaidigāga yiṁti nī kinniyum̐ gādā
maṁchidāya yim̐kanainā maṟavaguvayyā
(||ĕṁchi||)
pŏṁgeḍi jaladhi dachchi puṭṭiṁchidi vamṛtamu
aṁganamovine kādā amṛtamu
sĕṁgi poyi vaiguṁṭhāna śheṣhunibai baṁḍidivi
sĕṁgam̐ṭa nīsĕli yāru śheṣhum̐ḍe kām̐ḍā
(||ĕṁchi||)
āgāsāna nŏgaḍugu aḍigidivi balini
āgasamu sĕlinaḍumaṁdune kādā
megŏni vedālagum̐gā mīnavai pŏḍamidivi
kaigŏni sadigannule gaṁḍumīlu gāvā
(||ĕṁchi||)
kori śhrīveṁkaḍamanegŏṁḍa yĕkkidivi nīvu
kūrimi sĕligusālu kŏṁḍale kāvā
seri sarvajīvulasittamulo nilisidi
teri yāgĕ nī vurānam̐ diramāyam̐ gādā