ఎంచి చూడ నేమున్నది యిదిగో తన సుద్దులు
(॥పల్లవి॥)
ఎంచి చూడ నేమున్నది యిదిగో తన సుద్దులు
పొంచి నాకు నాకే నేను పొగడుకోఁ గాక
(॥ఎంచి॥)
చెలులెల్లా నినఁగాను చేరి తా నాడినమాట
కలుగవద్దా కోప మాఁపితిఁ గాక
వలపంచి న న్నింత వలలఁ బెట్టినందుకు
సొలయవద్దా అదీఁ జూడనైతిఁ గాక
(॥ఎంచి॥)
సిగ్గులు నేఁ బడఁగానే సేసినతనసేఁతకు
వొగ్గి ప్రతి సేయవద్దా వోర్చితిఁ గాక
వెగ్గళించి యాపెఁ దనవెంటఁ దెచ్చిన యందుకు
యెగ్గు పట్టవద్దా నే నెరఁగనై తిఁ గాక
(॥ఎంచి॥)
గుఱి గడచి తా నీకొప్పు పట్టినయందుకు
మఱి యాన వెట్టవద్దా మానితిఁ గాక
నెఱి శ్రీవేంకటేశుఁడు నేనలమేల్మంగను
మెఱసెఁ బొందింత వద్దా మెప్పించితిఁ గాక
(||pallavi||)
ĕṁchi sūḍa nemunnadi yidigo tana suddulu
pŏṁchi nāgu nāge nenu pŏgaḍugom̐ gāga
(||ĕṁchi||)
sĕlulĕllā ninam̐gānu seri tā nāḍinamāḍa
kalugavaddā koba mām̐pidim̐ gāga
valabaṁchi na nniṁta valalam̐ bĕṭṭinaṁdugu
sŏlayavaddā adīm̐ jūḍanaidim̐ gāga
(||ĕṁchi||)
siggulu nem̐ baḍam̐gāne sesinadanasem̐tagu
vŏggi pradi seyavaddā vorsidim̐ gāga
vĕggaḽiṁchi yābĕm̐ danavĕṁṭam̐ dĕchchina yaṁdugu
yĕggu paṭṭavaddā ne nĕram̐ganai tim̐ gāga
(||ĕṁchi||)
guṟi gaḍasi tā nīgŏppu paṭṭinayaṁdugu
maṟi yāna vĕṭṭavaddā mānidim̐ gāga
nĕṟi śhrīveṁkaḍeśhum̐ḍu nenalamelmaṁganu
mĕṟasĕm̐ bŏṁdiṁta vaddā mĕppiṁchidim̐ gāga