Emcham bode maavalla nee ke munnadi

ఎంచఁ బోతే మావల్ల నీ కే మున్నది
Language

(॥పల్లవి॥)
ఎంచఁ బోతే మావల్ల నీ కే మున్నది
నించిన యీ పుణ్యమెల్ల నీ దింతే కాక

(॥ఎంచ॥)
పోయిన జన్మ మెఱఁగ పుట్టిన పుట్టు గెఱుఁగ
కాయము గరఁగేది యెక్కడో యెఱుఁగ
యీయెడ నేమి దలఁచే నెట్టి ధ్యానము సేసేను
నీయంత రక్షించే మేలు నీదింతే కాక

(॥ఎంచ॥)
రేపటిసుద్ధు లెఱుఁగ రేతిరిసుద్దు లెఱుఁగ
పై పై సంసారముల భ్రమయెఱుఁగ
చేపట్టి యెట్టు పూజించే సేవ నీ కేమి సేసేను
నీ పెఁపున గాచేమేలు నీ దింతే కాక

(॥ఎంచ॥)
నే నెడెవ్వఁడనో యెఱుఁగ నిలుక డేదో యెఱుఁగ
ఆనుకొన్న యీ జగము అంతా నెఱుఁగ
కోనల శ్రీ వేంకటేశ కొలువ నే మెఱుఁగుదు
నే నని కై కొన్నమేలు నీ దింతే కాక

(||pallavi||)
ĕṁcham̐ bode māvalla nī ke munnadi
niṁchina yī puṇyamĕlla nī diṁte kāga

(||ĕṁcha||)
poyina janma mĕṟam̐ga puṭṭina puṭṭu gĕṟum̐ga
kāyamu garam̐gedi yĕkkaḍo yĕṟum̐ga
yīyĕḍa nemi dalam̐se nĕṭṭi dhyānamu sesenu
nīyaṁta rakṣhiṁche melu nīdiṁte kāga

(||ĕṁcha||)
rebaḍisuddhu lĕṟum̐ga redirisuddu lĕṟum̐ga
pai pai saṁsāramula bhramayĕṟum̐ga
sebaṭṭi yĕṭṭu pūjiṁche seva nī kemi sesenu
nī pĕm̐puna gāsemelu nī diṁte kāga

(||ĕṁcha||)
ne nĕḍĕvvam̐ḍano yĕṟum̐ga niluga ḍedo yĕṟum̐ga
ānugŏnna yī jagamu aṁtā nĕṟum̐ga
konala śhrī veṁkaḍeśha kŏluva ne mĕṟum̐gudu
ne nani kai kŏnnamelu nī diṁte kāga