ఎంచ నెట్టువచ్చునమ్మ ఇలమీఁద నీకొత్తలు
(॥పల్లవి॥)
ఎంచ నెట్టువచ్చునమ్మ ఇలమీఁద నీకొత్తలు
పంచశరు బలమేలే భామ సింగారములు
(॥ఎంచ॥)
తామరల విరులపైని తగుశాలిగర్భములు
ఆ మీఁద నరఁటులును అంగజు తేరు
చీమకదొంతరకొన సింహపుఁగొదమ వాలె
యేమని పొగడవచ్చు నింతిసింగారములు
(॥ఎంచ॥)
జక్నల సరుసనే జంటతామరతూండ్లు
అక్కడ శంఖముమీఁద నమరెఁ బోక
చొక్కవు గురులును జోడైన యుద్దములు
యెక్కువల కెక్కుడాయ నింతి సింగారములు
(॥ఎంచ॥)
ఇరవై సంపెఁగవువ్వు ఇరువంక శ్రీకారాలు
అరచంద్రుఁడు దుమ్మిది లన్నిటిమీఁద
నిరతి శ్రీవేంకటేశ నీకాఁగిటిలోపల
గరిమఁ గీర్తన కెక్కె కాంత సింగారములు
(||pallavi||)
ĕṁcha nĕṭṭuvachchunamma ilamīm̐da nīgŏttalu
paṁchaśharu balamele bhāma siṁgāramulu
(||ĕṁcha||)
tāmarala virulabaini taguśhāligarbhamulu
ā mīm̐da naram̐ṭulunu aṁgaju teru
sīmagadŏṁtaragŏna siṁhabum̐gŏdama vālĕ
yemani pŏgaḍavachchu niṁtisiṁgāramulu
(||ĕṁcha||)
jaknala sarusane jaṁṭadāmaradūṁḍlu
akkaḍa śhaṁkhamumīm̐da namarĕm̐ boga
sŏkkavu gurulunu joḍaina yuddamulu
yĕkkuvala kĕkkuḍāya niṁti siṁgāramulu
(||ĕṁcha||)
iravai saṁpĕm̐gavuvvu iruvaṁka śhrīgārālu
arasaṁdrum̐ḍu dummidi lanniḍimīm̐da
niradi śhrīveṁkaḍeśha nīgām̐giḍilobala
garimam̐ gīrdana kĕkkĕ kāṁta siṁgāramulu