Emayyeenogaani yimkanoyammaa

ఏమయ్యీనోకాని యిఁకనోయమ్మా
Language

(॥పల్లవి॥)
ఏమయ్యీనోకాని యిఁకనోయమ్మా
ప్రేమతో వయసు పెంచితినే

(॥ఎమ॥)
చల్లుఁజూపులు పతి చల్లఁగ గుండె
జల్లురనె నిచ్చట నోయమ్మా
కొల్లగా నవ్వి కొసరఁగ మేను
చెల్లఁబో నాకు చెమరించెనే

(॥ఎమ॥)
పేరుకొని తాను పిలువఁగ
యీరీతిఁ బులకలేలో యమ్మా
వూరకే గోర నొరయఁగ
దారిఁబడి మేలు తలకెక్కెనే

(॥ఎమ॥)
మోనమునఁ దాను మొక్కఁగ
నానె సిగ్గు లున్నతి నోయమ్మా
పాని శ్రీవేంకటపతిఁ గూడఁగ
తానే నేనైతి తగుఁదగునే

(||pallavi||)
emayyīnogāni yim̐kanoyammā
premado vayasu pĕṁchidine

(||ĕma||)
sallum̐jūbulu padi sallam̐ga guṁḍĕ
jalluranĕ nichchaḍa noyammā
kŏllagā navvi kŏsaram̐ga menu
sĕllam̐bo nāgu sĕmariṁchĕne

(||ĕma||)
perugŏni tānu piluvam̐ga
yīrīdim̐ bulagalelo yammā
vūrage gora nŏrayam̐ga
dārim̐baḍi melu talagĕkkĕne

(||ĕma||)
monamunam̐ dānu mŏkkam̐ga
nānĕ siggu lunnadi noyammā
pāni śhrīveṁkaḍabadim̐ gūḍam̐ga
tāne nenaidi tagum̐dagune