ఏమయ్యా తాఁకి తలఁచ విదివో నీవు
(॥పల్లవి॥)
ఏమయ్యా తాఁకి తలఁచ విదివో నీవు
నేమపుఁ జెలిపై దయ నించే రిందరును
(॥ఏమ॥)
పంతములాడదు నీతో బాసలు నిన్నడుగదు
యెంతేసి ప్రియాలు చెప్పీ నిందరిలోన
చెంతల నెప్పుడు నీ చిత్తమెట్లానున్నదో
కాంతఁ జూచితే మనసు గరఁగీ నందరికి
(॥ఏమ॥)
చలములు మెరయదు జగడించదెపుడును
చెలిమి యెంత నెరపీఁ జెలి నీతోను
యెలమి నీ విటమీఁద నెటువలె మన్నించేవో
పొలతి భావము చూచి పొగడే రందరును
(॥ఏమ॥)
పెనఁగ దెంతైనాను బిగిసి మాటాడదు
యెనసి కాఁగిటఁ గూడె యిట్టె నిన్ను
ఘన శ్రీవేంకటేశ నీకాయ మెంత చొక్కెనో
వనితఁజూచి మొక్కవచ్చే రిందరును
(||pallavi||)
emayyā tām̐ki talam̐sa vidivo nīvu
nemabum̐ jĕlibai daya niṁche riṁdarunu
(||ema||)
paṁtamulāḍadu nīdo bāsalu ninnaḍugadu
yĕṁtesi priyālu sĕppī niṁdarilona
sĕṁtala nĕppuḍu nī sittamĕṭlānunnado
kāṁtam̐ jūside manasu garam̐gī naṁdarigi
(||ema||)
salamulu mĕrayadu jagaḍiṁchadĕbuḍunu
sĕlimi yĕṁta nĕrabīm̐ jĕli nīdonu
yĕlami nī viḍamīm̐da nĕḍuvalĕ manniṁchevo
pŏladi bhāvamu sūsi pŏgaḍe raṁdarunu
(||ema||)
pĕnam̐ga dĕṁtainānu bigisi māḍāḍadu
yĕnasi kām̐giḍam̐ gūḍĕ yiṭṭĕ ninnu
ghana śhrīveṁkaḍeśha nīgāya mĕṁta sŏkkĕno
vanidam̐jūsi mŏkkavachche riṁdarunu